Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మహేష్ గా మారుతున్న మైనం!

By:  Tupaki Desk   |   26 July 2018 5:21 PM GMT
ఫోటో స్టొరీ: మహేష్ గా మారుతున్న మైనం!
X
ఎన్నైనా చెప్పండి... తెలుగోళ్ళకు ఓ వీక్నెస్ ఉంది. అదేంటంటే మనవాళ్ళ గొప్పదనాన్ని మనం గుర్తించం. అదే పక్కనోళ్ళు కనక మనవాళ్ళను గుర్తిస్తే సీన్ మొత్తం మారిపోతుంది. మనం వాళ్ళను నెత్తిన పెట్టుకుంటాం! బాలచందర్..భారతీ రాజా సూపర్.. మణిరత్నం.. బాలా సూపర్ అంటాం గానీ మనకు కూడా విశ్వనాథ్.. బాపులు ఉన్నారని.. ఈ జెనరేషన్ లో క్రిష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారని గుర్తు పెట్టుకోం. అదే స్టార్ హీరోల విషయానికి వస్తే ప్రభాస్, మహేష్ లు మేడమ్ టుస్సాడ్స్ లాంటి మ్యుజియం లో చోటు సాధించి సౌత్ మొత్తం మీద సంచలనం సృష్టించారు. మరి అదే వేరే ఏ సౌత్ హీరో కూడా సాధించలేదన్న విషయం మర్చిపోతాం!

ప్రభాస్ 'బాహుబలి' గెటప్ లో ఉన్న మైనపు విగ్రహం ఆల్రెడీ మేడం టుస్సాడ్స్ లో కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు విగ్రహాన్ని పెట్టేందుకు టుస్సాడ్స్ వారు మహేష్ బాబు కొలతలను తీసుకెళ్ళారు. వాళ్ళిప్పుడు మహేష్ విగ్రహాన్ని ఎంతో నైపుణ్యంతో.. జాగ్రత్తగా తయారు చేస్తున్నారు. టుస్సాడ్స్ లో విగ్రహాలు ఒరిజినల్ మనిషిలానే ఉంటాయని పేరు. మరి రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ ఫోటో చూస్తే అది నిజమే అనిపించక మానదు. అందమైన మహేష్ మొహాన్ని ఇవాన్ రీస్ ఎంత జాగ్రత్తగా చెక్కుతున్నాదో ఓ సారి లుక్కేయండి.

అసలు మైనపు బొమ్మ 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' లోనే ఇంత అందంగా ఉంటే ఇక అంతా రెడీ అయిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో! అందుకే కదా అందరూ మేడం టుస్సాడ్స్ మ్యుజియంలో ఎవరిదైనా బొమ్మ పెడితే ఒక పెద్ద న్యూస్ గా మారేది..!