Begin typing your search above and press return to search.

మహేష్ ముందే సెంచరీ కొట్టాడు..

By:  Tupaki Desk   |   17 May 2016 7:31 AM GMT
మహేష్ ముందే సెంచరీ కొట్టాడు..
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మరో మూడు రోజుల్లో విడుదలకు కానుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఉత్సవాలు స్టార్ట్ చేసేయగా.. 20 తేదీన బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. మరి ఇంకా సినిమా రిలీజ్ కాక ముందే సెంచరీ కొట్టడం ఎలా సాధ్యం అనే డౌట్ వచ్చినా.. ఇది నిజమే. ఏ మూవీలో అయినా మహేష్ స్టైలింగ్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. బ్రహ్మోత్సవంలో కూడా ఈ డిఫరెన్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

బ్రహ్మోత్సవం టీజర్లు - పోస్టర్లలో పర్టిక్యులర్ గా ఈ తేడా కనిపిస్తోంది. ఇందుకు మహేష్ ఓ కలర్స్ కంపెనీ ఓనర్ కావడం అని ముందే చెప్పినా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం బైటకొచ్చింది. బ్రహ్మోత్సవం హైలైట్స్ లో మహేష్ డ్రెసింగ్ కూడా ఒకటి అంటున్నారు. సినిమాలో సిట్యుయేషన్ - సీన్ - బ్యాక్ గ్రౌండ్ ప్రకారం మహేష్ వేసే డ్రస్సుల కలర్స్ ఉంటాయట. అది కూడా చాలా సింపుల్ గా మహేష్ డ్రెసింగ్ ఉంటుందని, ఏ మాత్రం ఆర్భాటం లేకుండా ఇవన్నీ డిజైనింగ్ చేశామని స్టైలిస్టులు చెబుతున్నారు.

'బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు విజయవాడకు చెందిన ఓ సింపుల్ కేరక్టర్ చేస్తున్నాడు. అందుకే ఆ పాత్రకు తగినట్లుగా చాలా సింపుల్ గా డిజైన్ చేశాం. ప్రతీ ఫ్రేమ్ లో మహేష్ సింపుల్ గా కనిపించడమే కాదు.. చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. మొత్తం మహేష్ కేరక్టర్ 100 రకాల డ్రస్సులతో కనిపిస్తుంది' అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అలా మహేష్ వంద డ్రస్సులతో సెంచరీ కొట్టేశాడు మహేష్.