Begin typing your search above and press return to search.

మహేష్ బాబు రెండో ఛాన్స్ ఇస్తాడా ?

By:  Tupaki Desk   |   21 May 2019 11:00 PM IST
మహేష్ బాబు రెండో ఛాన్స్ ఇస్తాడా ?
X
తనకో పెద్ద బ్రేక్ ఇచ్చినా లేదా మనసుకు నచ్చిన సినిమా తీసినా ప్రిన్స్ మహేష్ బాబు దర్శకుడికి మరో ఛాన్స్ ఇవ్వడం గతంలో చాలా సార్లు జరిగింది. ఒక్కడు ఇండస్ట్రీ హిట్ కొట్టాక అంతకు రెట్టింపు బడ్జెట్ తో సైనికుడు చేశాడు. అతడు ఇచ్చిన అభిమానమే త్రివిక్రమ్ తో ఖలేజా చేసేలా ప్రేరేపించింది. శ్రీమంతుడు ఫలితం ఇంకోలా ఉంటే కొరటాల శివకు భరత్ అనే నేను దక్కేది కాదు. పోకిరితో మాస్ ఇమేజ్ తెచ్చిన పూరికి కథ వినకుండానే బిజినెస్ మెన్ ఛాన్స్ ఇచ్చాడు.

ఇందులో ఈ కాంబోల రెండో సినిమా ఫలితం ఏమైంది అనేది పక్కన పెడితే మహేష్ కు గురి కుదిరితే ఇంకో అవకాశం గ్యారెంటీ అనే నమ్మకం అయితే కలిగించింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి వంతు వచ్చింది.కమర్షియల్ సక్సెస్ రేంజ్ ఏంటనేది పక్కన పెడితే మహేష్ మహర్షిని చాలా చాలా పర్సనల్ గా తీసుకుని ప్రమోట్ చేశాడు. స్వంత సినిమాకు సైతం ఇంత కష్టపడిన దాఖలాలు లేవు. పదే పదే మహర్షి గురించి చాలా ఎమోషనల్ గా ఫీలవ్వడం సక్సెస్ మీట్స్ లో చూశాం.

సో మహేష్ ఇప్పుడు వంశీ పైడిపల్లికి ఇంకో ఆఫర్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటికే అనిల్ రావిపూడి తర్వాత పరశురామ్-సందీప్ వంగా-సుకుమార్-త్రివిక్రమ్ అంటూ ఎన్నో పేర్లు వెయిటింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని వంశీకి ఇంకో ఛాన్స్ దగ్గరలో రాకపోయినా ఖచ్చితంగా దక్కవచ్చు. ఎలాగూ స్క్రిప్ట్ కి బాగా టైం తీసుకునే వంశీ పైడిపల్లికి ఇది అవసరం కూడా. చూద్దాం ఈ కాంబో మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో