Begin typing your search above and press return to search.
మహేష్ కోరిక నెరవేర్చిన కేటీఆర్
By: Tupaki Desk | 23 July 2019 5:15 AM GMTఅది 'భరత్ అనే నేను' సినిమా ప్రమోషన్. అందులో సీఎంగా మహేష్ బాబు పెట్టిన స్టిక్ట్ రూల్స్.. సినిమా నేపథ్యం చూసి ఫిదా అయిన అప్పటి మంత్రి కేటీఆర్ చిట్ చాట్ కు వచ్చాడు. ఓ వైపు మహేష్ .. మరో వైపు కేటీఆర్.. మధ్యలో దర్శకుడు కొరటాల శివ కూర్చుకున్నారు. వీరు కొందరు యువకులు, విద్యార్థులతో భేటి అయ్యారు..
ఈ క్రమంలోనే ''మహేష్ తన ఫ్యామిలీతో కలిసి తరచూ విదేశీ పర్యటనలు చేస్తుంటాడని మా ఇంట్లో భార్యపిల్లలు పోరుపెడుతారని.. మనమూ వెళదామని ఒత్తిడి తెస్తారని.. కానీ తన బిజీ షెడ్యూల్ వల్ల వీలుకావడం లేదు'' అని కేటీఆర్ వాపోతారు. మీరు లక్కీ అని మహేష్ ను కేటీఆర్ అంటారు. దానికి మహేష్.. 'మీ బాధ్యత పెద్దది సార్.. మీరు ప్రజల కోసం పనిచేస్తారు. టైం చూసుకొని వెళ్లిరండి' అంటూ పొగిడేస్తారు.. అక్కడికి కట్ చేస్తే...
ఇప్పుడు కేటీఆర్ వరుసగా హాలీడేస్ ట్రిప్ లు, భార్య పిల్లలతో జాలీగా తిరుగుతున్నారట.. విదేశాలు, వివిధ టూరిస్ట్ ప్లేసులకు కుటుంబంతో పయనమై ఎంజాయ్ చేస్తున్నారు. తొలి తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ పాలనను పట్టాలెక్కించడానికి కేసీఆర్- కేటీఆర్ లు తీవ్రంగా శ్రమించారు. అన్ని చక్కదిద్దారు. ఇక రెండోపర్యాయం గెలిచాక కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్ కు చోటు కల్పించలేదు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. కేటీఆర్ సారథ్యంలోనే పార్లమెంట్- పరిషత్- సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఈ మధ్యలో గ్యాప్ రావడం.. కేటీఆర్ ఇప్పుడు మంత్రి కూడా కాకపోవడం పెద్దగా పనిలేకుండా పోయింది.
అందుకే ఈ మధ్య కేటీఆర్ తన షెడ్యూల్ అంతా పక్కనపెట్టి కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి సేదతీరుతున్నారు. ఇలా నాడు మహేష్ ట్రిప్పులు చూసి అసూయ పడిన కేటీఆర్ కు ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. అందుకే మహేష్ లానే ట్రిప్పులను ఎంజాయ్ చేస్తున్నారు. నాటి మహేష్ కోరికను.. తన కుటుంబ అభిలాషను నెరవేరుస్తున్నాడు. రాజకీయాల్లో నేతలకు చాలా తక్కువ సమయం ఇలా విరామం దొరుకుతుంది. మళ్లీ మంత్రి అయ్యేలోపు కేటీఆర్ ఇంకా చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టివస్తే బెటర్. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్లీ పాత కేటీఆర్ వచ్చి బిజీ అయిపోతారు.. సో లెట్స్ గో కేటీఆర్.