Begin typing your search above and press return to search.

తన ఫ్యాన్ తో మహేష్‌

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:16 AM GMT
తన ఫ్యాన్ తో మహేష్‌
X
సినిమా నటులకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అదీ హీరోలకయితే ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారు. ప్రిన్స్ మహేష్ బాబు లాంటి స్టార్ కయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో లెక్కే ఉండదు. స్టయిల్ కు ఐకాన్ ఉండే ఆయనకు యూత్ లోనే కాదు.. అన్ని వర్గాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు తో కలసి ఒక్క ఫొటో అయినా దిగాలని కోరుకునే వారెంతమందో.

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా కంప్లీట్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. రొమేనియా దేశంలో షాట్ గ్యాప్ లో రిలాక్స్ అవుతూ ఓ ఫొటోకు బ్రహ్మాండమైన ఫోజ్ ఇచ్చాడు. మహేష్ భార్య నమ్రత ఈ ఫొటోను ‘తన ఫ్యాన్ తో మహేష్’ అనే కామెంట్ పెట్టి మరీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది చూసిన వాళ్లందరూ ఎవరా ఫ్యాన్ అని ఆసక్తిగా చూశాక అవాక్కవుతున్నారు. ఓ చిన్న ఫ్యాన్ ముందు కూర్చుని రిలాక్స్ అవుతున్న విషయం అర్ధమయ్యాక నమ్రత సెన్సాఫ్ హ్యూమర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంకొందరైతే మోస్ట్ లాయల్ ఫ్యాన్ - ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫ్యాన్ అంటూ కామెంట్లు పెడుతూ మరింత నవ్వులు పంచుతున్నారు.

తెలుగు - తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లకు రానుంది. అందుకోసం సినిమాకు సంబంధించి పెండింగ్ పనులు కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. మహేష్ ఈ సినిమా చేస్తుండగానే కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను మూవీ స్టార్ట్ చేశాడు. ఇందులో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.