Begin typing your search above and press return to search.
50 లక్షలివ్వు.. లేదా ఆలియాను చంపేస్తా
By: Tupaki Desk | 2 March 2017 3:41 PM GMTబాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత మహేష్ భట్ అనుకోని సమస్యలో చిక్కుకున్నారు. ఒక అపరిచితుడి నుంచి ఆయన బెదిరింపులు ఎదుర్కొన్నారు. రూ.50 లక్షలు ఇవ్వాలని లేదంటే కూతుర్ని.. భార్యను చంపేస్తానని ఆ అపరిచితుడు బెదిరించడం గమనార్హం. ముందు ఇది ఎవరో తమాషాకు చేసిన పని అని మహేష్ భట్ లైట్ తీసుకున్నారట. కానీ తర్వాత ఆ నంబర్ నుంచి అదే పనిగా కాల్స్ రావడం.. వాట్సాప్ ద్వారా కూడా వరుసగా మెసేజ్ లు రావడంతో కంగారుపడ్డారు. 50 లక్షలు ఇవ్వకుంటే కూతురు ఆలియా.. భార్య సోని రజ్దాన్ లను చంపేస్తానని ఆ అపరిచితుడు తీవ్ర స్వరంతో బెదిరించడంతో మహేష్ భట్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు.
మహేష్ భట్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాడిగా ముంబయి పోలీసులు అనుమానిస్తున్నారు. అతనో కుర్రాడని కూడా తేలింది. ఉత్తరప్రదేశ్ పోలీసులతో కలిసి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకునే అవకాశముంది. తాను బెదిరింపు కాల్స్ అందుకున్న మాట వాస్తవమే అని మహేష్ భట్ ట్విట్టర్ ద్వారా కన్ఫమ్ చేశారు. ఈ విషయంలో తనకు సహకరిస్తున్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఒకప్పుడు దర్శకుడిగా వరుసగా సినిమాలు చేసిన మహేష్ భట్.. గత కొన్నేళ్లుగా మెగా ఫోన్ పక్కన పెట్టేశారు. నిర్మాతగా మాత్రమే సినిమాలు తీస్తున్నారు. ఆయన తనయురాలు ఆలియా ప్రస్తుతం బాలీవుడ్లో కథానాయికగా దూసుకెళ్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/