Begin typing your search above and press return to search.

నా మొద‌టి కూతురు పుట్టిన‌ట్టుగా ఉంద‌న్న‌ భ‌ట్

By:  Tupaki Desk   |   9 Nov 2022 4:30 AM GMT
నా మొద‌టి కూతురు పుట్టిన‌ట్టుగా ఉంద‌న్న‌ భ‌ట్
X
బాలీవుడ్ యువ‌జంట అలియా భట్ - రణబీర్ కపూర్ తమ జీవితంలోకి ఆడపిల్లను స్వాగతించారు. ఇంత‌కుముందే తాను బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు ఆలియా స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించింది. భ‌ట్స్ కుటుంబంలో అత్యంత ఉత్సాహంగా ఉండే అంద‌మైన అమ్మాయి అలియా తండ్రి మహేష్ భట్ తాత‌గా ప్ర‌మోట్ అయ్యారు. ఆయ‌న ఈ ఉద్విగ్న క్ష‌ణాల‌ను ఎంత‌గానో ఆస్వాధిస్తున్నారు. తన మొదటి కూతురు పూజా భట్ పుట్టినప్పుడు మహేష్ భ‌ట్ లో ఎలాంటి ఉద్వేగం క‌లిగిందో ఇప్పుడు కూడా అలాగే భావించాడని అత‌డి కుమారుడు రాహుల్ భట్ వెల్లడించాడు.

రాహుల్ బాంబే టైమ్స్‌తో మాట్లాడుతూ- ''ప్రస్తుతం అత‌డు (మ‌హేష్ భ‌ట్) గర్వించదగిన వ్యక్తి. నాన్న గారు అలియా శిశువు రాక కోసం వేచి ఉండలేకపోతున్నారు. అతనికి ముగ్గురు కుమార్తెలు.. పూజా.. షాహీన్ .. అలియా. కాబట్టి వీరి మ‌ధ్య‌కు మ‌రో ఆడ‌పిల్ల ప్ర‌వేశం ఎంతో బావుంది. అందుకే అతను(నాన్న గారు) దీన్ని తన మొదటి కుమార్తె పూజ పుట్టిన సమయంలో ఉద్విగ్న‌త‌తో పోలుస్తున్నారు'' అని తెలిపారు.

న‌వ‌జాత శిషువు తల్లిదండ్రుల గురించి రాహుల్ మాట్లాడుతూ-''ఆలియా చాలా బాధ్యతాయుతమైనది. రణబీర్ చాలా హ్యాండ్ ఆన్ డాడ్ అవుతాడని నేను భావిస్తున్నాను'' అని అన్నారు. రాహుల్ ఇంకా మాట్లాడుతూ.... తాను 'అమ్మ'గా మారడం చాలా సంతోషంగా ఉందని తల్లి- బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు'' అని తెలిపారు. అయితే అతను ఇంకా అలియా నవజాత కుమార్తెను కలవలేదు.

రాహుల్ భట్ -పూజా భట్ లు మహేష్ భట్ మొదటి భార్య కిరణ్ భట్ క జ‌న్మించిన పిల్లలు. తరువాత మహేష్ భట్ సోనీ రజ్దాన్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు - అలియా-షాహీన్. మహేష్ భట్ యొక్క నలుగురు పిల్లలు చాలా సన్నిహిత బంధాన్ని క‌లిగి ఉన్నారు. వారి మ‌ధ్య అనుబంధాలు ఆప్యాయ‌త‌లు అన్నివేళ‌లా అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశం.

ఆదివారం ముంబైలోని హెచ్‌.ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో అలియా తన కుమార్తెకు జన్మనిచ్చింది. అలియా- రణబీర్ జంట‌ శిశువు రాకను ఉమ్మ‌డిగా ప్రకటించారు. మా జీవితంలోని ఉత్తమ వార్తలలో.. మా పాప గురించిన‌వే.. ఇదిగో ఇక్కడ ఉంది.. క్యూటీ ఎంత అద్భుతమైన‌ అమ్మాయి. మేము అధికారికంగా ప్రేమతో ఇది చెబుతున్నాం. పేరెంట్స్ !!!!! లవ్ లవ్ లవ్... మీ ఆశీస్సులు కావాలి'' అని అలియా ఉద్వేగానికి లోన‌య్యారు. ఆమె ఇంకా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాలేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అలియా- ర‌ణ‌బీర్ జంట‌గా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించి త‌మ మొద‌టి బిడ్డ‌ను స్వ‌గ‌తించే ముందు గొప్ప కానుక‌గా మారింది. ఆలియా తదుప‌రి వ‌రుస చిత్రాల్లో న‌టించాల్సి ఉంది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ- జీ లే జరా వంటి సినిమాల్లో కనిపించనుంది. నెట్ ఫ్లిక్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ తో హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఇందులో గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటించారు. ఇంత‌కుముందే ఆలియాపై చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.