Begin typing your search above and press return to search.
డైరెక్టర్ తేడా అంటున్న మహేష్!
By: Tupaki Desk | 27 Nov 2018 11:46 AM GMT#మీటూ లో భాగంగా ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల మీద ఆరోపణలు వచ్చాయి. టాలీవుడ్ లో అంత సీరియస్ ఆరోపణలు లేవుగానీ బాలీవుడ్ లో మాత్రం #మీటూ హాటుగానే ఉంది. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో డైరెక్టర్ సాజిద్ ఖాన్ కూడా ఉన్నాడు. ఇప్పటికే నలుగురు మహిళలు సాజిద్ ఖాన్ పై #మీటూ కాంపెయిన్ లో భాగంగా ఆరోపణలు చేశారు.
తాజాగా సాజిద్ ఖాన్ పై మరో బాంబు పేలింది. కానీ ఈసారి ఇలాంటి ఆరోపణలు చేసింది టెన్నిస్ ఛాంపియన్ మహేష్ భూపతి కావడం విశేషం. తాజాగా 'వుయ్ ది వుమన్' అనే ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ భూపతి మాట్లాడుతూ తన భార్య లారా దత్తా కొన్నేళ్ళ క్రితం తనతో షేర్ చేసుకున్న విషయాలు వెల్లడించాడు. " మేము డేటింగ్ చేస్తూ ఉన్న సమయంలో లారా 'హౌస్ ఫుల్' సినిమాలో నటించేది. అప్పట్లో లండన్ లో షూటింగ్ జరిగింది. షూటింగ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత లారా.. తన స్నేహితురాలైన హెయిర్ డ్రెస్సర్ ఇద్దరూ సాజిద్ ఖాన్ తమ సహ నటి తో ఎలా రూడ్ గా.. వల్గర్ గా ప్రవర్తించేవాడో చెప్పేవారు. అప్పట్లో మీరు(హౌస్ ఫుల్ లీడ్ యాక్టర్స్) ఎందుకు పక్కన వాళ్ళకు ఇబ్బంది కలిగినపుడు మాట్లాడరని ప్రశ్నించాడట. తప్పు జరినప్పుడు మాట్లాడకపోతే అతను చేసే పనిని మీరు సమర్థించినట్టేనని చెప్పాడట.
ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఈ విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని.. స్పోర్ట్స్ లో టాలెంట్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళడం అసాధ్యమని.. కానీ ఫిలిం ఇండస్ట్రీలో పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయనే విషయం తనకు తెలుసన్నాడు. ఇండస్ట్రీలోని వ్యక్తులు నీకు అవకాశం రాకండా చేయదలుచుకుంటే పని దొరకదని అన్నాడు. కానీ అలాంటి పరిస్థితి ఉంది కదా అని మనం మౌనంగా ఉండడం సరి కాదని అన్నాడు.