Begin typing your search above and press return to search.

మహేష్‌ పుట్టిన రోజున ట్విట్టర్‌ లో 20 మంది స్టార్స్‌ తో స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   7 Aug 2021 1:34 PM GMT
మహేష్‌ పుట్టిన రోజున ట్విట్టర్‌ లో 20 మంది స్టార్స్‌ తో స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌
X
మరో రెండు రోజుల్లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు రాబోతుంది. ఆయన పుట్టిన రోజు కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుండి పాటతో పాటు పోస్టర్ లు స్టిల్స్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. సర్కారు వారి పాట ట్రెండ్‌ సెట్‌ చేయడం కోసం అంతా సిద్దం అయ్యింది. మహేష్ బాబు నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు సంబంధించిన ది బెస్ట్‌ స్టిల్స్ ను కూడా అభిమానులు ఆ రోజున సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేందుకు గాను సిద్దంగా ఉన్నారు. ఇక మహేష్‌ బాబు పుట్టిన రోజున 20 మంది టాలీవుడ్‌ మరియు ఇతర భాషల స్టార్స్ మరియు సెలబ్రెటీలతో ప్రత్యేకమైన సెషన్ ఉండబోతుందట.

సోషల్‌ మీడియాలో మహేష్‌ బాబు పుట్టిన రోజున 20 మంది స్టార్స్‌ వారి వారి అభిప్రాయాలను వెళ్లడిస్తూ.. మహేష్‌ కు వారితో ఉన్న అనుబంధం గురించిన విషయాలను చెప్పబోతున్నారు. మహేష్ బాబు పుట్టిన రోజున సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి వరకు ఏ స్టార్‌ హీరోకు కాని సెలబ్రెటీకి కాని ఇలాంటి ప్రత్యేకమైన కానుక దక్కలేదు అనడంలో సందేహం లేదు. ఇది అంతా కూడా మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వారు షేర్‌ చేయబోతున్న ఈ వీడియోలు మరియు ఫొటోలు వారం రోజుల పాటు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

అభిమానులు మహేష్‌ బాబు గురించి చెప్పడం.. శుభాకాంక్షలు చెప్పడం చాలా కామన్‌ విషయం. కాని మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెబుతూ ఆయన గురించి మాట్లాడటం అంటే చాలా ప్రత్యేకమైన విషయం అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన పుట్టిన రోజు కోసం ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు. సినిమాలతోనే కాకుండా మహేష్‌ బాబు తన మంచి మనసుతో కూడా ఆకట్టుకున్నాడు. కనుక ఆయన్ను అభినందించేందుకు... పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చాలా మంది ముందుకు వస్తారు అనడంలో సందేహం లేదు. 20 మంది ప్రముఖులు మహేష్‌ బాబు గురించి ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.