Begin typing your search above and press return to search.

'సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్' టైమ్ అనౌన్స్ చేసిన 'సర్కారు వారి పాట' టీమ్..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 11:17 AM GMT
సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ టైమ్ అనౌన్స్ చేసిన సర్కారు వారి పాట టీమ్..!
X
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అప్పుడే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. కటౌట్లు బ్యానర్లు ప్లెక్సీలు కామన్ డీపీలు మోషన్ పోస్టర్స్, హ్యాష్ ట్యాగ్స్ అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. మరోవైపు మహేష్ కూడా అభిమానులకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా నుంచి సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ రిలీజ్ చేయనున్నారు.

'సర్కారు వారి పాట' చిత్ర బృందం గత 10 రోజులుగా రోజువారీ అప్‌డేట్‌ లతో డిజిటల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. గ్రాండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఫస్ట్ నోటీస్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్.. సోషల్ మీడియా మాధ్యమాలలో రికార్డులను బద్దలయ్యేలా చేశారు. ఫస్ట్ లుక్ లో మహేష్ బాబును సూపర్ స్టైలిష్ లుక్ లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా ఓ సర్ప్రైజింగ్ GIF తో బర్త్ డే బ్లాస్టర్ విడుదల సమయాన్ని ప్రకటించించారు. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు స్పెషల్ వీడియోని రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఫస్ట్ రిపోర్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో చేతిలో బ్యాగ్‌ తో మహేష్ బ్యాక్ పోజ్ చూపించగా.. ఇప్పుడు GIF లో సూపర్ స్టార్ ఫ్రంట్ పోజ్‌ ని చూపించారు. ఇందులో మహేష్ తన నడుముకున్న బెల్ట్ ని గట్టిగా లాగి బిగించడం చూడవచ్చు. మహేష్ ఇక్కడ కూల్ గా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.

ప్రమోషనల్ స్ట్రాటజీతో హైప్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. 'సర్కారు వారి పాట' టీజర్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. ఈ పక్కా కమర్షియల్ సినిమాలో మహేష్ బాబుని దర్శకుడు పరశురామ్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.