Begin typing your search above and press return to search.
రాజమౌళి సినిమా డేట్ల పై మహేష్ క్లారిటీ
By: Tupaki Desk | 11 May 2022 10:49 AM GMTమహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ సినిమాను మహేష్ బాబు చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా త్రివిక్రమ్ మరియు రాజమౌళిలతో చేయబోతున్న సినిమాల గురించి మహేష్ స్పందించాడు.
త్రివిక్రమ్ సినిమా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. మా ఇద్దరి కాంబో సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుసు. నేను కూడా చాలా ఆసక్తిగా ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. కథ చర్చల సమయంలోనే చాలా ఆసక్తి ఉంటుంది. షూటింగ్ సమయంలో కూడా త్రివిక్రమ్ తో వర్క్ చేస్తున్నప్పుడు మంచి ఫీల్ కలుగుతుందన్నాడు.
ఇక రాజమౌళి తో సినిమా విషయమై స్పందిస్తూ మా ఇద్దరి కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తుందని చెప్పగలను. అభిమానులు ప్రేక్షకులు ఎంతగా తమ కాంబినేషన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు. కనుక అంచనాలకు తగ్గకుండా తప్పకుండా మంచి సినిమాను రాజమౌళితో కలిసి చేస్తానంటూ మహేష్ బాబు హామీ ఇచ్చాడు.
రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు తీసుకుంటాడు అనే అభిప్రాయం ఉంది. ఆయన స్పీడ్ గా చేయాలని మొదట భావించినా కూడా మినిమం టైమ్ తీసుకుంటాడు. కనుక మహేష్ అందుకు రెడీనా అంటూ ప్రశ్నించిన సమయంలో రాజమౌళి గారితో ఒక్క సినిమా చేస్తే 25 సినిమాల అనుభవం వస్తుంది. కనుక అలాంటి వ్యక్తి దర్శకత్వంలో సినిమా కు కాస్త ఎక్కువ సమయం కేటాయించినా పర్వాలేదు అన్నాడు.
ఆ సమాధానంను బట్టి రాజమౌళి ఎన్ని డేట్లు అడిగితే అన్ని డేట్లు కూడా మహేష్ బాబు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు అన్నమాట. మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబో కోసం కథ సిద్దం అవుతోంది. ఆమద్య ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ కమ్ అడ్వంచర్ మూవీ కథ ను మహేష్ బాబు కోసం రెడీ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
రాజమౌళి కనీసం రెండేళ్ల పాటు మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది లో సినిమా ప్రారంభం అయితే 2025 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మా కాంబోలో రాబోతున్న మూవీ పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా మహేష్ బాబు ఇటీవల ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు.