Begin typing your search above and press return to search.
కృష్ణ బయోపిక్ పై మహేష్ కామెంట్
By: Tupaki Desk | 10 May 2022 5:22 AM GMTనటులు, క్రీడాకారులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు.. ఇలా రకరకాల వ్యక్తుల జీవిత గాథలు చాలానే తెరపైకి వస్తున్నాయి ఈ మధ్య. స్పోర్ట్స్ బయోపిక్స్ అయితే లెక్కే లేదు. ఐతే ఈ తరహా చిత్రాలు ఎక్కువగా హిందీలోనే వస్తున్నాయి. అక్కడే ఆదరణ కూడా దక్కుతోంది. కానీ తెలుగులో ఈ తరహా సినిమాలు తెరకెక్కడం తక్కువ. అలాగే ఆదరణ కూడా అన్నిటికీ ఉండట్లేదు.
మహానటి సావిత్రి జీవిత కథ పెద్దగా అంచనాల్లేకుండా వచ్చింది. అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ ఊపులో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రెండు భాగాల సినిమా తీస్తే విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది కానీ.. ఆ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పలేదు. దీంతో మళ్లీ బయోపిక్స్ ఊసు ఎత్తలేదు టాలీవుడ్ ఫిలిం మేకర్లు. ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జున మిశ్రమ స్పందన వ్యక్తం చేయడం తెలిసిందే.
ఇక తెలుగులో ఆ స్థాయి నటుల్లో బయోపిక్ తీయదగ్గ స్టేచర్ ఉందెవరికి అంటే.. సూపర్ స్టార్ కృష్ణే అని చెప్పాలి. ఐతే ఇప్పటిదాకా ఈ లెజెండరీ హీరో జీవిత చరిత్ర గురించి ఊసే లేదు. కాగా ఆయన తనయుడు మహేష్ బాబుకు ఈ విషయంలో విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది మేజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో. దీనికి మహేష్ ఆసక్తికర రీతిలో బదులిచ్చాడు.
కృష్ణ మీద ఎవరైనా సినిమా తీస్తే చూస్తానని.. కానీ తాను మాత్రం ఆయన పాత్రలో నటించలేనని.. ఎందుకంటే ఆయన తన దేవుడని చెప్పాడు మహేష్. మరి మీ జీఎంబీ బేనర్లో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారా అడిగితే.. ఎవరైనా డైరెక్టర్ ఈ ప్రపోజల్‌తో తన వద్దకు వస్తే కచ్చితంగా సొంత బేనర్లో నిర్మిస్తానని మహేష్ ప్రకటించాడు.
మరి ఎవరైనా స్క్రిప్టుతో వస్తే తన తండ్రి బయోపిక్ చేయడానికి సిద్ధమని మహేష్ ఆసక్తి కనబరిచిన నేపథ్యంలో ఎవరైనా ఈ ప్రపోజల్‌తో ఆయన్ని కలిసి మెప్పిస్తారేమో చూడాలి. కానీ ‘యన్.టి.ఆర్’ ఫలితం చూశాక కృష్ణ బయోపిక్ తీసే సాహసం ఎవరైనా చేస్తారా అన్నది మాత్రం సందేహమే.