Begin typing your search above and press return to search.
'సర్కారు వారి పాట' అక్కడ కూడా పాడేస్తారట
By: Tupaki Desk | 10 March 2022 1:30 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలే రూపొందుతున్నాయి. ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్పనా నాలుగైదు భాషల్లో రిలీజ్ అవుతోంది. మారిన మార్కెట్ ని.. పరిస్థితులకు అనుగుణంగా మన స్టార్ హీరోలు తమ మార్కెట్ ని విస్తరించుకోవాలనే ఆలోచనలో పడుతున్నారు.
తాము నటించిన సినిమాలని ఇతర భాషల్లోనూ ఏక కాలంలో విడుదల చేసి తమ మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేసుసులో ఇప్పటికే బాహుబలితో ప్రభాస్ , `పుష్ప ది రైజ్`తో అల్లు అర్జున్ డిస్టింక్షన్ లో పాసయ్యారు. పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు.
వీరి తరువాత నేచురల్ స్టార్ నాని కూడా ప్రయత్నించాడు. నాని తను నటించిన `శ్యామ్ సింగరాయ్` చిత్రాన్ని తెలుగులో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేశాడు. ప్రచారం కూడా చేశాడు. కానీ తెలుగుకు మించి అక్కడ ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ హీరో తరువాత లైన్ లో వున్న హీరో విజయ్ దేవరకొండ.
`లైగర్` మూవీతో పాన్ ఇండియా ని టార్గెట్ చేశాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ ఆగస్టులో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇదే తరహాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా `హరి హర వీరమల్లు`తో పాన్ ఇండియాని టార్గెట్ చేశాడు. ఇది చిత్రీకరణ దశలో వుంది.
ఇలా వరుసగా క్రేజీ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ని విస్తరించుకునే పనుల్లో బిజీగా వుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు లేట్ గా రంగంలోకి దిగుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ , 14 ప్లస్ రీల్స్ , జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ వీడియో `కళావతి..` ఇటీవలే విడుదలై నెట్టింట రికార్డుల మోత మోగిస్తోంది. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఒకే సారి తమిళంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇందులో విశేషం ఏంటంటే తమిళ వెర్షన్ కు హీరో మహేష్ బాబు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతున్నారట. ఇలా మహేష్ తన సినిమాకు తమిళంలో డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే తొలిసారని మేకర్స్ చెబుతున్నారు.
వున్నట్టుండి మహేష్ లో ఈ మార్పుకి కారణం రానున్న త్రివిక్రమ్ మూవీతో పాటు రాజమౌళి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయి చిత్రాలే కావడం.. వాటికి తన వాయిస్ నే ఇతర భాషల్లోనూ వినిపించాలని మహేష్ భావిస్తున్నారు కాబట్టే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ గా వుంటుందని `సర్కారు వారి పాట` తమిళ వెర్షన్ కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మహేష్ ముందు చూపుని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారట.