Begin typing your search above and press return to search.
MB26 మ్యూజిక్.. ఫ్యాన్ సూచన ఇదీ!!
By: Tupaki Desk | 28 May 2019 9:09 AM GMTసంగీత దర్శకులు ఎందరు ఉన్నా స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ ఎందుకు అందరిలో యూనిక్ అనిపించుకోగలిగారు? వరల్డ్ లోనే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా .. ఆస్కార్ గ్రహీతగా ఎదగడం అన్నది ఎలా సాధ్యమైంది? అంటే మూస ధోరణికి దూరంగా మారుతున్న యువతరం ఆలోచన ధోరణికి అనుగుణంగా సుస్వరాల్ని అందించడం ద్వారానే అతడు యూనిక్ అయ్యారని చెప్పొచ్చు. యువతరం స్పీడ్ కి తగ్గట్టే అతడు పాశ్చాత్య స్వరాలకు కర్నాటిక్ తో భారతీయ శైలి జోడించి అందించడంలో సఫలమయ్యారు. పాప్ .. ర్యాప్.. సహా ప్రపంచంలోని నలు మూలల్లో ఎక్కడ ఏ సంగీత సంస్కృతి ఉన్నా దానిని అధ్యయనం చేయడం ఇక్కడ కొత్తగా ఏం ఇవ్వాలి? అని ఆలోచించడం వల్లనే అదంతా సాధ్యమైంది. అయితే ఏ.ఆర్.రెహమాన్ తర్వాత ఎందరో సంగీత దర్శకులయ్యారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఓ వెలుగు వెలిగినా ఆయన స్థాయిని మాత్రం అందుకోలేకపోయారనడం అతిశయోక్తి కాదు.
కెరీర్ ఆరంభమే ఏ.ఆర్.రెహమాన్ ఎందరో కొత్త తరం గాయనీగాయకులకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. అప్పటి వరకూ ఉన్న ఫక్తు మూసధోరణికి భిన్నంగా కొత్త గొంతు ఎక్కడ ఉన్నా ఒడిసిపట్టుకుని అవకాశం ఇచ్చి సక్సెసయ్యారు. స్వార్థానికి అతీతంగానూ అతడు పని చేశారు. అందుకే అంత పెద్ద స్థాయికి ఎదిగారు. అయితే రెహమాన్ తో పోలుస్తూ .. ఇతర సంగీత దర్శకులు ఉండాలని అనడం సరికాదు కానీ.. ఆయనలా కొన్ని విషయాల్లో ఎందుకు ఉండరు? అని మాత్రం ప్రశ్నించగలం.
ఇదే ప్రశ్న తాజాగా రాక్ స్టార్ దేవీశ్రీకి మహేష్ అభిమాని నుంచి ఎదురైంది. ``మ్యాడమ్ మహేష్ సర్ ఓన్లీ దేవీశ్రీతోనే పని చేస్తున్నారు ఎందుకు? ఛేంజ్ కావాలి. అతడి పాటలన్నీ ఒకే సౌండింగ్ తో ఉన్నాయి. శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చండి ప్లీజ్. శ్రేయా ఘోషల్ .. ఆర్మాన్ మాలిక్ లాంటి గొప్ప సింగర్స్ ఉండగా దేవీనే పాడేస్తాడు.. తన టీమ్ కే ఛాన్సిస్తాడు.. ఆయనొద్దు ప్లీజ్..`` అంటూ నేరుగా నమ్రతకే ఇన్ స్టాగ్రమ్ లో సూచించాడు. ఎంబీ 26 మూవీకి ఒక కొత్త సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకోవాల్సిందిగా అతడు సూచించడం ఆశ్చర్యపరిచింది. సరిగ్గా ఆ అభిమాని ఏం అన్నాడో క్రిటిక్స్ సైతం అదే తీరుగా దేవీశ్రీ మూస ఫార్ములా మ్యూజిక్ ని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ కంఫర్ట్ కోసమే దేవీశ్రీకి పదే పదే అవకాశం ఇస్తున్నారా? అన్న సందేహం కలగకపోలేదు. దేవీశ్రీని మార్చకపోయినా .. కనీసం అతడు మారి దేశంలో ఉన్న గొప్ప గొప్ప సింగర్లకు అవకాశాలు కల్పిస్తే బావుంటుందేమో!! స్వరాల పరంగానూ రొటీనిటీ లేకుండా కొత్త దనం నిండిన సుస్వరాల్ని సృజించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఏ.ఆర్.రెహమాన్ నిర్మాతగా `99 సాంగ్స్` అనే సినిమా తీస్తున్నారు. ఈ చిత్రంతో రెహమాన్ రచయితగానూ పెన్ పవర్ చూపిస్తున్నారు. శ్రేయా ఘోషల్ లాంటి ట్యాలెంటెడ్ సింగర్ తో పాడిస్తున్నారు. ఇంకా ఈ సినిమా కోసం స్వరాల పరంగా బోలెడన్ని ప్రయోగాలు చేస్తున్నారట. విశ్వేష్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకుడు. జూన్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.