Begin typing your search above and press return to search.
మహర్షి లెన్త్ గురించి అభిమానుల కామెంట్
By: Tupaki Desk | 9 May 2019 4:52 AM GMTఎట్టకేలకు నెలల తరబడి జరుగుతున్న ఎదురుచూపులకు మహర్షి చెక్ పెట్టేశాడు. కనివిని ఎరుగని భారీ స్థాయిలో మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కించుకున్నాడు. రెస్పాన్స్ ఎలా ఉందనే విషయం ఇప్పటికిప్పుడు తేల్చే విషయం కాదు కాని బెనిఫిట్ షో చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలను కొంత వరకు సేకరించి విశ్లేషించి చూస్తే లెంత్ విషయంలో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి .
మూడు గంటల నిడివి ఇలాంటి కథ డిమాండ్ చేయదని వంశీ పైడిపల్లి కొంచెం కేర్ తీసుకుని ఓవరాల్ గా కనీసం ఓ ఇరవై నిముషాలు తగ్గించి ఉంటె ఇంకా ఎఫెక్ట్ ఉండేదని అంటున్నారు. సాధారణంగా తెల్లవారుఝామున వేసే షోలో ఇలా మూడు గంటలకు పైగా ధియేటర్లో గడపాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు నిద్రలేమి ప్రభావం చూపిస్తుంది. అలాంటప్పుడు లెంత్ గురించిన ఫీడ్ బ్యాక్ ఇదే తరహలో ఉంటుంది
మహర్షికు కూడా అదే కోణంలో ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయితే జనరల్ ఆడియన్స్ ఎలా స్పందిస్తారు అనే దాని బట్టే ఇది పాజిటివ్ గా ఉంటుందా లేదా అనేది బయటపడుతుంది. అప్పటి దాకా వెయిట్ చేయాల్సిందే. గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భరత్ అనే నేను కాని అంతకు ముందు మహేష్ ఖాతాలో ఉన్న శ్రీమంతుడు కాని ఇలా మూడు గంటల నిడివితో లేవు. సబ్జెక్టు డిమాండ్ చేసింది కాబట్టి అంత అవసరం అయ్యిందని వంశీ చెప్పాడు.దానికి ఎంత మేరకు న్యాయం జరిగిందో మెజారిటీ అభిప్రాయాలు తెలుసుకున్నాకే కంక్లూజన్ కు రావాలి.