Begin typing your search above and press return to search.
మహేష్ మోకాలికి శస్త్ర చికిత్స?
By: Tupaki Desk | 25 Jan 2020 2:35 PM GMTసూపర్ స్టార్ మహేష్ అమెరికా ప్రయాణం అసలు గుట్టు తెలిసింది. ఆయన మూడు నెలల పాటు సుదీర్ఘ వెకేషన్ కి వెళ్లారని ప్రకటించడంలోనే ఏదో మతలబు ఉందన్న సందేహం అభిమానులకు ముందే కలిగింది. అయితే ఎవరూ గ్రహించలేకపోయారు. ఎట్టకేలకు ఆ గుట్టేమిటో తెలిసింది.
మహేష్ మోకాలి గాయం నొప్పి తిరగబెట్టింది. అది ఇప్పటిది కాదు. 2014లో ఆగడు చిత్రీకరణలో మొదలైంది. అప్పట్లోనే భళ్లారి గనుల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సహా టైటిల్ పాటని తెరకెక్కించారు. ఆ టైమ్ లో మహేష్ మోకాలికి గాయం అయ్యింది. ఆ గాయం అప్పటికి ఏమీ చేయకపోయినా కాలక్రమంలో సూది పోటులా మారిందట. అయినా మహేష్ దానిని భరిస్తూనే షూటింగుల్లో పాల్గొంటున్నారు.
ఎట్టకేలకు ఆ నొప్పి ఇంకా వేధిస్తుండడంతో ఇక లాభం లేదని అమెరికాలో శస్త్ర చికిత్సకు రెడీ అయ్యారట. ఇంతకుముందు మహేష్ మూడునెలల వెకేషన్ ప్లాన్ లో ఉన్నారని నమ్రత ప్రకటించగానే అందరిలో డౌట్ పుట్టుకొచ్చింది. అయితే అప్పటికి అది ఎవరూ పట్టించుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. బడలిక తీరాలంటే ఆ మాత్రం తప్పదు అనుకున్నారు. అయితే ఇంత లాంగ్ గ్యాప్ వెనక అంత మ్యాటర్ ఉందన్నది తాజాగా ఉప్పందింది. మూడు నెలల సుదీర్ఘ విరామం అంటే.. శస్త్ర చికిత్స అయ్యాక కోలుకునేందుకే అంత సమయం పడుతుందన్నమాట. అంటే మే వరకూ వంశీ పైడిపల్లితో ఎంబీ 27 సెట్స్ కి వెళ్లడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. దీనర్థం 2021లోనే మళ్లీ మహేష్ సినిమా థియేటర్లలోకి వస్తుందన్నమాట. అయితే మహేష్ మోకాలి శస్త్ర చికిత్స గురించి నమ్రత కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉందింకా.