Begin typing your search above and press return to search.

`అల వైకుంఠపురములో` కి మహేష్ ఛలో

By:  Tupaki Desk   |   20 April 2021 3:30 AM GMT
`అల వైకుంఠపురములో` కి మహేష్  ఛలో
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన అతడు మూవీ మంచి హిట్ కాగా, ఖలేజా సినిమా డిజాస్టర్ అయింది. ఖలేజా ప్లాప్ అయినా మహేష్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. చాలా మంది ఆడియన్స్ కి అదో బెస్ట్ మూవీ. దాంతో మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు రీపీట్ అవుతుందా అని చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూసారు. మొత్తానికి రీసెంట్ గా ఆలాంటి అభిమానుల కోసం మహేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పాడు.

దాంతో మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాకి రంగం సిద్ధ‌మైంది. ప్రస్తుతం చేస్తున్న `స‌ర్కారు వారి పాట‌` త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇది అని క్లారిటీ వచ్చేసింది. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ క‌థ సిద్ధం చేసేశాడని సమాచారం. మరి ఆ కథ ఎలా ఉండబోతోంది. యాక్షన్ సినిమానా లేక అతడు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనరా అనే చర్చ మొదలైంది. అయితే మహేష్ బాబు క్లారిటీగా చెప్పేసారట. తనకు `అల వైకుంఠపురములో` లాంటి కథే కావాలని అడిగారట. అంటే దాని అర్దం..సరదాగా ఫన్ తో నడిచిపోతూ, చిన్న ఎమోషన్ తో సినిమా పూర్తవ్వాలని. త్రివిక్రమ్ బలం అదే కాబట్టి ఖచ్చితంగా అదిరిపోయే అవుట్ పుట్ ఇస్తాడని మహేష్ నమ్ముతున్నాడు. పాత పాయింట్ అయినా కొత్తగా చెప్పే త్రివిక్రమ్ నైపుణ్యం ..మహేష్ కు తెలిసిందే కాబట్టి స్క్రిప్టు ఫైనల్ నేరేషన్ విని సెట్స్ కు వెళ్లిపోదామని చెప్పారట.

గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు ఎంత హిలేరియస్ ఫన్ ని పంచాయో అందరికీ తెలిసిందే. విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటే ఆ ఇద్దరి కాంబోలో సినిమాలపై అభిమానులకు, ఆడియెన్స్‌కి ఉండే ఆసక్తి ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సారి కూడా మంచి కామెడీతో ఖచ్చితంగా త్రివిక్రమ్ అలరిస్తాడు.

ఇక క్రితం సంవత్సరం ఆరంభంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టగా, అటు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రంతో సెన్సేషన్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాంతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.. అటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమాని ప్లాన్ చేసాడు. కానీ ముందుకు వెళ్లలేదు. ఎప్పటిలాగే మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజైన మే 31న ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. మిగతా డిటేల్స్ త్వ‌ర‌లోనే తెలుస్తాయి.