Begin typing your search above and press return to search.

హమ్మయ్య.. మహేష్ ఆ టచ్ ఇవ్వట్లేదు!

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:30 PM GMT
హమ్మయ్య.. మహేష్ ఆ టచ్ ఇవ్వట్లేదు!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల కథనాలు సినిమా షూటింగ్ మొదలవకముందే హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.

సినిమా టైటిల్ దగ్గర నుంచి మెయిన్ కథ వరకు అనే రకాల అంశాలపై కూడా రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇప్పటివరకు దర్శకుడు త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో క్యాస్టింగ్ ను కూడా అఫీషియల్ గా ప్రకటించింది లేదు.

అయినప్పటికీ కూడా వివిధ భాషల నుంచి దర్శకుడు టాలెంటెడ్ నటీనటులను రంగంలోకి దింపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే అసలు మహేష్ బాబును త్రివిక్రమ్ ఏ విధంగా చూపించబోతున్నాడు అనే విషయంలో ఇదివరకే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇటీవల మహేష్ బాబు కనిపించిన విధానం ని బట్టి చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా మరో కొత్త లుక్ లో మహేష్ దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం.

అతడు సినిమాలోనే మహేష్ బాబుకు పెద్దగా జుట్టు లేకుండా చాలా సింపుల్ గా ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్ ఆ తరువాత ఖలేజాలో కొంత క్యాజువల్ లుక్ తో హైలెట్ చేశాడు. ఇక ఈసారి మాత్రం న్యూ హ్యాండ్సమ్ లుక్కుతో ఆకట్టుకుపోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మహేష్ ప్రతిసారి కూడా తన సినిమాలో మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాలు చేయడం ఓ వర్గం వారికి రుచించడం లేదు. శ్రీమంతుడు నుంచి ఇది మరీ రొటీన్ అయిపోయింది అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

ఇక ఈసారి మాత్రం త్రివిక్రమ్ సినిమాలో మెసేజ్ అనే పాయింట్ ఉండదట. ఈ సినిమాలో మొదట ఫ్యామిలీ కమర్షియల్ పాయింట్స్ ఆ తర్వాత ఒక యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎక్కడ మెసేజ్ ఇవ్వకుండా కథలో భాగంగానే దర్శకుడు మహేష్ బాబును హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా మహేష్ ఈసారి సోషల్ మెసేజ్ టచ్ ఇచ్చే అవకాశం లేనట్లు పక్కాగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.