Begin typing your search above and press return to search.
మహేష్ మూవీ క్రేజీ అప్ డేట్ ఇచ్చిన జక్కన్న!
By: Tupaki Desk | 27 Oct 2022 2:36 AM GMTరాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టార్ మూవీ'RRR'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన మూవీ ఇది. 1920 ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు తెలుగు నేల పోరాట యోధుల ఫిక్షనల్ కథగా ఈ మూవీని తెరకెక్కించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కలిసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటే ఎలా వుంటుందనే ఓ కల్పిత కథ తో ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించాడు.
విదేశీ ప్రేక్షకుల్ని సైతం విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ మొదలైన తరువాత దేవ విదేశాలలో వున్న విదేశీ ప్రేక్షకుల్ని, హాలీవుడ్ స్టార్స్ ని, డైరెక్టర్స్ ని, రైటర్స్ ని, టెక్నిషియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్ల మేర వసూళ్లని రాబట్టింది.
ఈ నేపథ్యంలో ఈ మూవీని ఇండియన్ సినిమా కేటారీలో ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేట్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండియా తరుపున'ఛల్లో' మూవీని ఆస్కార్ కి విదేశీ చిత్రాల విభాగంలో నామినేషన్ కి పంపడంతో'RRR'ని కూడా ప్రత్యేక విభాగం కోసం నామినేట్ అయ్యేలా రాజమౌళితో పాటు యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల యుఎస్ లో'RRR'ని ప్రత్యేకంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ మూవీని అక్టోబర్ 21న జపాన్ లో విడుదల చేశారు. రాజమౌళి తెరకెక్కించిన'బాహుబలి'కి జపాన్ లో విశేష స్పందన రావడంతో ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని'RRR' ని కూడా జపాన్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ని ప్రమోట్ చేయడం కోసం ఇద్దరు హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో కలిసి జపాన్ వెళ్లిన జక్కన్న అక్కడ పలు మీడియాలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్ ని వెల్లడించాడు. మీ తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నారని అడిగితే నా తదుపరి ప్రాజెక్ట్ ని తెలుగులోనే చేస్తున్నానని, మహేష్ బాబు అందులో నటించనున్నాడని వెల్లడించారు.
సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఇదొక అడ్వెంచర్ యాక్షన్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ మూవీలోని కీలక యాక్షన్ ఘట్టాల్లో ఒక దాన్ని జపాన్ లో చిత్రీకరించాలనుకుంటున్నానని స్పష్టం చేయడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.