Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్‌ హీరోతో మహేష్‌ మూవీ

By:  Tupaki Desk   |   13 Dec 2020 4:44 AM GMT
ట్యాలెంటెడ్‌ హీరోతో మహేష్‌ మూవీ
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే అడవి శేషు హీరోగా మేజర్ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా షూటింగ్‌ ముగించుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేజర్‌ సినిమా విడుదల కాకముందే మహేష్‌ తన బ్యానర్‌ లో తదుపరి సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నవీన్ పొలిశెట్టి ని హీరోగా పెట్టి ఒక సినిమాను మహేష్‌ బాబు చేసేందుకు సిద్దంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్‌ పొలిశెట్టి ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్‌ బాబు బ్యానర్‌ లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్‌ అయిన మహేష్‌ బాబు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. నవీన్‌ పొలిశెట్టి టైమింగ్‌ మరియు అతడి నటన శైలి నచ్చడంతో మహేష్‌ బాబు ఆయన్ను ఎంకరేజ్‌ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం నవీన్‌ 'జాతి రత్నాలు' అనే సినిమాను చేస్తున్నాడు.

మరో వైపు మహేష్‌ బాబు తన సినిమా సర్కారు వారి పాటకు వచ్చే ఏడాది ఆరంభం నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు. నిర్మాణ వ్యవహారాలను నమ్రతతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి చూసుకుంటారు. హీరోగా బిజీగా ఉన్నా కూడా నిర్మాతగా మారి కొత్త వారిని ఎంకరేజ్‌ చేయడం అభినందనీయం అంటూ మహేష్‌ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.