Begin typing your search above and press return to search.

31 డిసెంబ‌ర్ మ‌హేష్ వెకేష‌న్ లేన‌ట్టే

By:  Tupaki Desk   |   21 Dec 2022 12:30 AM GMT
31 డిసెంబ‌ర్ మ‌హేష్ వెకేష‌న్ లేన‌ట్టే
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌తియేటా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం కుటుంబంతో క‌లిసి విదేశాల‌కు వెళుతుంటారు. త‌న ఫేవ‌రెట్ డెస్టినేష‌న్ దుబాయ్ లో ఇలాంటి ఎగ్జ‌యిటింగ్ వేడుక‌లు జ‌రుపుకునేందుకు ఆయ‌న ఆస‌క్తిగా ఉంటారు. ఈ పార్టీకి బంధుమిత్రులు కూడా అటెండ‌వుతుంటారు. గ‌త ఏడాది పైడిప‌ల్లి ఫ్యామిలీ దుబాయ్ సెల‌బ్రేష‌న్ లో మ‌హేష్ కుటుంబంతో పాటు ఫుల్ చిలౌట్ అయింది. డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ పార్టీ మొద‌లు జ‌న‌వ‌రి తొలివారంలో దుబాయ్ లోనే ఈ కుటుంబాలు సెల‌బ్రేట్ చేసుకున్నాయి.

2021 కి బాయ్ చెబుతూ కొత్త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా వెల్ కమ్ చెప్పారు. అంత‌కుముందు ఏడాది కూడా జ‌న‌వ‌రి ఒక‌టి వేడుక‌ల కోసం మ‌హేష్ - పైడిప‌ల్లి కుటుంబాలు క‌లిసి దుబాయ్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి మ‌హేష్ త‌న కుటుంబం స‌హా బంధుమిత్రుల‌తో నూత‌న సంవ‌త్స‌ర ఉత్స‌వాల కోసం దుబాయ్ లేదా విదేశాల‌కు వెళ‌తారా? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

అయితే ఈ సంవ‌త్స‌రం మ‌హేష్ సెల‌బ్రేష‌న్ మూడ్ లో లేర‌న్న‌ది వాస్త‌వం. బ్యాక్ టు బ్యాక్ ఒకే ఏడాదిలో త‌న కుటుంబంలో ముగ్గురు ఆప్తుల‌ను ఆయ‌న కోల్పోయారు. దీనివ‌ల్ల‌ డిసెంబ‌ర్ 31 వేడుక‌లు స‌హా జ‌న‌వ‌రి తొలి వారం వెకేష‌న్ ప్లాన్ ఏదీ లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇంత కష్టంలోను మ‌హేష్ ఇప్పుడు పూర్తిగా త‌న దృష్టిని త్రివిక్ర‌మ్ తో సినిమాపైనే పెట్టాల్సి ఉంది. మెజారిటీ పార్ట్ అత‌డు సెల‌వుల‌ను ఆస్వాధించే మూడ్ లో లేడ‌ని తెలుస్తోంది.

మ‌హ‌ర్షి - స‌ర్కార్ వారి పాట చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్న మ‌హేష్ ప్రస్తుతం త్రివిక్ర‌మ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాల‌న్న పంతంతో ప‌ని చేస్తున్నార‌ని స‌మాచారం. త్రివిక్ర‌మ్ త‌ర్వాత రాజ‌మౌళితో భారీ పాన్ ఇండియా సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ‌తారు. ఆ త‌ర్వాత‌ మ‌రోసారి పైడిప‌ల్లితో ప‌ని చేసే అవ‌కాశం ఉంది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ తో పాన్ ఇండియా సినిమాని పూర్తి చేసి అటుపై పైడిప‌ల్లి కూడా మ‌హేష్ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికి ఇత‌ర ద‌ర్శ‌కుల క‌థ‌లు వినే ఆలోచ‌న‌లోను మ‌హేష్ లేర‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.