Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌: ఎలిమినేషన్ జోన్ లో ఆ ముగ్గురు...

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:43 AM GMT
బిగ్‌ బాస్‌: ఎలిమినేషన్ జోన్ లో ఆ ముగ్గురు...
X
సోమవారం ఎపిసోడ్ లో ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌ లో ముగిసింది. గత వారాలకు భిన్నంగా బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ పెట్టి... అందులో ఫోన్ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడి..వారు ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవుతున్నారని చెప్పి...బిగ్ బాస్ వారికి సేవ్ చేసుకునే అవకాశం కల్పించారు. నామినేట్ అయిన వారి కోసం ఇతర సభ్యులు కొన్ని త్యాగాలు చేయడంతో కొందరు సేఫ్ అయ్యారు.

అయితే మంగళవారం ఎపిసోడ్ లో హిమజ సరిగా త్యాగం చేయకపోవడం వల్ల మహేశ్ ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో రవి - రాహుల్ ల నామినేషన్ కొనసాగింది. అయితే రవి సేఫ్ అవ్వాలంటే శివజ్యోతి హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పడంతో...ఆ పని చేసింది. దీంతో రవి సేఫ్ అయ్యాడు. రాహుల్ సేఫ్ అవ్వాలంటే పునర్నవి ఈ వారం మినహా మిగతా అన్నీ వారాలు ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవ్వాలని చెప్పడంతో...అందుకు రాహుల్ ఒప్పుకోలేదు. తనకు తను ఈ వారం నేరుగా నామినేట్ అయ్యాడు.

తర్వాత కెప్టెన్ అయిన వితికాని ఒక సభ్యున్ని నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ చేయమని చెప్పడంతో ఆమె హిమజ పేరు చెప్పింది. అందుకు మ‌హేశ్‌ ను ఎలిమినేష‌న్ నుంచి ఆమె సేవ్ చేసేందుకు చేసే ప్ర‌య‌త్నం స‌రిగా చేయ‌క‌పోవ‌డం. దీంతో ఈ వారం మహేశ్ - రాహుల్ - హిమజ ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్లారు. అయితే అంతకముందు టాస్క్ ద్వారా వరుణ్ పేడ నీళ్ళలో పడుకుని హిమజని సేఫ్ చేసిన విషయం తెలిసిందే. అలా వరుణ్ సేఫ్ చేస్తే..వితికా నామినేట్ చేయడం విశేషం. మరి చూడాలి ఈ వారం ఇంటి నుంచి ఈ ముగ్గురులో ఎవరు ? బయటకు వెళ్లతారో.