Begin typing your search above and press return to search.

మహేష్‌-రాజమౌళి మూవీ... ఈసారి ఓ ఇంట్రెస్టింగ్‌ పుకారు

By:  Tupaki Desk   |   16 Sep 2022 10:03 AM GMT
మహేష్‌-రాజమౌళి మూవీ... ఈసారి ఓ ఇంట్రెస్టింగ్‌ పుకారు
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మెల్ల మెల్లగా సాగుతున్నాయి. అతి త్వరలోనే ప్రొడక్షన్ వర్క్‌ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనే సినిమా గురించి రోజుకు ఒక పుకారు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా హీరోయిన్ గురించిన కొత్త పుకారు ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఆ పుకారు అనుసారంగా ఈ సినిమాలో మహేష్‌ బాబు కోసం జోడీగా బాలీవుడ్‌ స్టార్ నెం.1 హీరోయిన్ దీపిక పదుకునే ను ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. సినిమా యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు ఆమెను సంప్రదించలేదు.. కానీ ఈ ప్రాజెక్ట్‌ కు ఆమె సూటబుల్‌ అన్నట్లుగా జక్కన్న టీం నిర్ణయానికి వచ్చారట.

ఈ పుకారు చాలా ఆసక్తికరంగా ఉందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు. ఇది పుకారు కాకుండా నిజంగానే మహేష్‌ బాబు కి జోడీగా దీపిక పదుకునేని దర్శకుడు రాజమౌళి నటింపజేస్తే జాతీయ స్థాయిలో కుమ్మేయడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్‌ చేయాలో.. మరెంత మంది పుకార్లు వినాల్సి వస్తుందో అంటున్నారు.

రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం చాలా కామన్ విషయం. ఈ సినిమాని అంతకు మించి అన్నట్లుగా రాజమౌళి తెరకెక్కించబోతున్నాడు. తాజాగా ఆయన సోషల్‌ మీడియా ద్వారా మహేష్ బాబు తో చేయబోతున్న సినిమా గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అన్నట్లుగా పేర్కొన్నాడు.

ఇది ఒక అద్భుతమైన విజువల్‌ వండర్ అన్నట్లుగా ఉంటుందని రాజమౌళి అభిమానులు ముందు నుండే నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను చేరడం అనేది మానవుడు మూన్‌ ను చేరడం వంటిది. ఇప్పుడు రాజమౌళి తన మహేష్ బాబు సినిమాతో ఏకంగా 2500 కోట్ల రూపాయల వసూళ్లను టార్గెట్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

రాజమౌళి బలంగా తల్చుకోవాలే కాని.. గట్టిగా ప్రయత్నించాలే గాని కచ్చితంగా అయ్యి తీరుతుంది. అందుకే మహేష్ బాబు సినిమాతో కూడా రాజమౌళి ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనేది ఇండస్ట్రీ వర్గాల మరియు అభిమానుల మాట. ప్రస్తుతానికి హీరోయిన్‌ కి సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. ముందు ముందు కూడా ఏదో ఒకటి వార్త ప్రతి రోజు వస్తూనే ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.