Begin typing your search above and press return to search.
మహేష్ 'చార్లీ' సుధీర్ బాబు
By: Tupaki Desk | 14 Feb 2019 6:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత ప్రొడక్షన్ లో ఒక వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్న విషయం తెల్సిందే. నమ్రత నిర్మాణ కార్యక్రమాలు చూడబోతున్న ఆ వెబ్ సిరీస్ కు 'చార్లీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. నాన్నకు ప్రేమతో చిత్రానికి రచయితగా వ్యవహరించిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. 8 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతుందని, కొత్త వారితో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
ఇటీవలే మహేష్ బాబు ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి 'చార్లీ' చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. మహేష్ బాబు ఫ్యామిలీ నుండి ఎవరు రాబోతున్నారా అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ గా సుధీర్ బాబు పేరు బయటకు వచ్చింది. 'ఛార్లీ' వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో సుధీర్ బాబు కనిపించబోతున్నాడు. ఒక వైపు హీరోగా వెండి తెరపై అలరిస్తున్న సుధీర్ బాబు వెబ్ సిరీస్ కు కమిట్ అవ్వడం ఆశ్చర్యంను కలిగిస్తుంది.
మహేష్ బాబు ప్రొడక్షన్ అవ్వడంతో పాటు, మంచి స్క్రిప్ట్, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో సుధీర్ బాబు కాదనలేక పోయినట్లుగా తెలుస్తోంది. సుధీర్ బాబు ఎంట్రీతో 'చార్లీ' స్థాయి మరింతగా పెరిగింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రానుందా లేదంటే అమెజాన్ ప్రైమ్ లేదా మరేదైనా స్ట్రీమింగ్ సంస్థ ద్వారా రానుందా అనేది త్వరలో వెళ్లడి కానుంది.