Begin typing your search above and press return to search.

SVP రిలీజ్ డే : మహేష్ కంగ్రాట్స్ చెప్పాడట

By:  Tupaki Desk   |   16 May 2022 10:30 AM GMT
SVP రిలీజ్ డే : మహేష్ కంగ్రాట్స్ చెప్పాడట
X
మహేష్ బాబు కరోనా కు ముందు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సర్కారు వారి పాటను చేస్తున్నట్లుగా దర్శకుడు పరశురామ్‌ విడుదలకు ముందు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో పరశురామ్‌ అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. ఎట్టకేలకు మహేష్ బాబు వంటి ఒక పెద్ద దర్శకుడితో సినిమాను చేసే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది. ఆ అవకాశంను పరశురామ్‌ ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించుకోవాలనుకున్నాడు. అందుకోసం కాస్త ఎక్కువ కష్టమే పడ్డాడు. సినిమా దాదాపు ఏడాది కాలం పాటు ఎదురు చూసిన తర్వాత ఎట్టకేలకు విడుదల అయ్యింది.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. అభిమానుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా కామన్‌ ఆడియన్స్ నుండి యావరేజ్ అనే టాక్ వచ్చింది. కాని కొందరు మాత్రం సినిమా డిజాస్టర్ అంటూ వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో ట్రోల్స్ కూడా చేయడం మొదలు పెట్టారు. ఎవరు ఎన్ని అన్నా కూడా సర్కారు వారి పాట వసూళ్లు చాలా పాజిటివ్‌ గా ఉన్నాయంటూ నిర్మాతలు చెబుతున్నారు.

సర్కారు వారి పాట విడుదల సమయంలో మహేష్ బాబు స్పందన ఏంటీ.. విడుదల అయిన తర్వాత మొదటి సారి మహేష్ రియాక్షన్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. ఆ విషయమై దర్శకుడు పరశురామ్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు సినిమా విడుదల అయిన రోజు ఉదయమే స్వయంగా ఆయనే కాల్‌ చేశాడట.

ఒక ఇంటర్వ్యూలో పరశురామ్‌ మాట్లాడుతూ... సినిమా రిలీజ్ డే ఉదయం 8 గంటలకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. సినిమాకు మంచి టాక్ వస్తున్న నేపథ్యంలో మనం సక్సెస్ సాధించాం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సక్సెస్ నా కెరీర్‌ కు అత్యంత కీలకం. కనుక నాకు ఆ కంగ్రాట్స్ కొత్త జీవితాన్ని ఇచ్చినంత ఆనందం కలిగిందని పరశురామ్‌ చెప్పుకొచ్చాడు.

సర్కారు వారి పాట సినిమా ను కొందరు పని కట్టుకుని ట్రోల్‌ చేస్తున్నారు అనే విమర్శలు మహేష్ బాబు అభిమానులు చేస్తున్నారు. ఇదే సమయంలో వారు స్పందిస్తూ ఎంతగా విమర్శలు చేసినా ట్రోల్స్ చేసినా కూడా సినిమా వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ ఏడాది మేటి సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని వారు చెబుతున్నారు.