Begin typing your search above and press return to search.
మహేష్ చెప్పింది కరెక్ట్ అంటున్న బన్నీ
By: Tupaki Desk | 11 Jan 2020 11:36 AM GMTసంక్రాంతి సినిమాలలో ఇప్పటికే రెండు రిలీజ్ అయ్యాయి. రేపు అల్లు అర్జున్ సినిమా 'అల వైకుంఠపురములో' రిలీజ్ అవుతోంది. దీంతో అల్లు అర్జున్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. పోటీలో ఉన్నప్పటికీ 'సరిలేరు నీకెవ్వరు'కు ఇతర సంక్రాంతి సినిమాలకు అల్లు అర్జున్ ఇప్పటికే ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈమధ్య మరో ఇంటర్వ్యూలో మహేష్ బాబు వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు ఆసక్తికరంగా స్పందించారు.
స్టార్ హీరోలు పెద్దగా ప్రయోగాలు చేయకపోవడం గురించి మహేష్ మాట్లాడుతూ "అందరూ స్టార్లు ప్రయోగాల విషయంలో చొరవ చూపించకపోవడానికి కారణం భారీ బడ్జెట్లు ఉండడమే. పెట్టుబడి పెట్టిన వారు నష్టాల బారిన పడకూడదనే ఆలోచనతోనే స్టార్లు ప్రయోగాలకు వెనకాడుతున్నారు" అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ తో ప్రస్తావిస్తే "అది నిజమే" అన్నారు. "చాలా ఏళ్ల కష్టపడిన తర్వాతే స్టార్ హీరోలకు పెద్ద మార్కెట్ వస్తుంది. ఇలా 100 కోట్లు అంతకంటే ఎక్కువ మార్కెట్ ఉన్న హీరోలు మళ్లీ వెనక్కుపోయినట్టుగా 10 కోట్ల బడ్జెట్ సినిమాల్లో నటించడం అనవసరం. తమ స్థాయికి తగ్గట్టుగానే ప్రయోగాలు చెయ్యాలి. చిన్న బడ్జెట్ సినిమాలు చెయ్యడం వీలు కాదు" అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
ఆలోచించి చూస్తే అల్లు అర్జున్ చెప్పింది నిజం అనిపించక మానదు. స్టార్ హీరోలు కనుక తక్కువ బడ్జెట్ సినిమాలు చేస్తే ఆ సినిమాల క్వాలిటీ కూడా ఆ బడ్జెట్ కు తగ్గట్టే బీ గ్రేడ్ లోనో సీ గ్రేడ్ లోనో ఉంటుంది. అప్పుడు అభిమానులే సినిమాపై విమర్శలు చేసే ప్రమాదం కూడా ఉంటుంది. స్టార్ హీరోలు అంటే..ఆ రేంజ్ మెయింటెయిన్ చెయ్యక తప్పదేమో.