Begin typing your search above and press return to search.
మహేష్ 'మహా' మౌనం ఎందుకో
By: Tupaki Desk | 25 Feb 2019 7:32 AM GMTఎన్టీఆర్ మహానాయకుడు ఫలితం వచ్చేసింది. సాధ్యమైనంత మేర దాని కలెక్షన్లకు సంబంధించిన వార్తలు కనిపించకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్ని అనుకున్నా ఇప్పుడు లాభం లేదు. కథానాయకుడుని మించిన డిజాస్టర్ గా సీక్వెల్ ప్రయాణం మరీ దారుణంగా ఉంది. ముందు రోజు సాయంత్రం ఎఏంబి సినిమాస్ ప్రీమియర్ వేయకపోయినా బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నారట. ఇదలా ఉంచితే కథానాయకుడు విడుదల సమయంలో బాలయ్య పెర్ఫార్మన్స్ క్రిష్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా పొగుడుతూ మహేష్ ట్వీట్లు పెట్టడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
మహేష్ మెచ్చుకున్నా సినిమా ఆడలేదు. టాప్ 3 డిజాస్టర్ లో చోటు దక్కించుకుంది. కేవలం 20 కోట్ల షేర్ తో బాలయ్య కెరీర్ లో పెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇప్పుడు మహానాయకుడు వంతు వచ్చింది. మహేష్ దీని గురించి ఎలాంటి ట్వీటు పెట్టలేదు. తెలుగు రాష్ట్రాలలో మొదటి షో ముందు రోజు సాయంత్రం మహేష్ బాబు సూపర్ ప్లెక్స్ లోనే వేసారు. టీంతో పాటు ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులతో ప్రీమియర్ ఈవెంట్ కళకళలాడింది. మహేష్ అందులో లేడు.
అయితే కథానాయకుడు లాగే మహానాయకుడి గురించి కూడా మహేష్ ఏమైనా చెబుతాడేమో అని ఆశించారు నందమూరి ఫ్యాన్స్. అయితే మహేష్ నుంచి ఎలాంటి స్పందన లేదు. బహుశా ప్రీమియర్స్ అవ్వగానే తన టీం నుంచి వచ్చిన రిపోర్ట్స్ చూసుకుని ఎందుకులెమ్మని సైలెంట్ అయ్యుంటాడనే టాక్ ఉంది. అంత పొగిడిన కథానాయకుడే ఆడనప్పుడు అసలు ఆడే అవకాశమే లేని మహానాయకుడు గురించి మహేష్ ట్వీట్ ఎలా చేసాడు. నిజమే మరి