Begin typing your search above and press return to search.

మ‌హేష్ SSMB28కి టైటిల్ అదేనా?

By:  Tupaki Desk   |   13 Sep 2022 10:33 AM GMT
మ‌హేష్ SSMB28కి టైటిల్ అదేనా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో దాదాపు 12 ఏళ్ల సుధీర్ఘ విరామం త‌రువాత #SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ భారీ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇది మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ‌వ ప్రాజెక్ట్. రెండు నెల‌ల క్రితం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని మ‌హేష్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ సోమ‌వారం లాంఛ‌నంగా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

త‌న గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మ‌హేష్ ఈ మూవీని భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ తో ప్రారంభించేశాడు. బ‌స్ నేప‌థ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్ ని మ‌హేష్ పై ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాల‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ప్లాన్ చేశాడు. ఇందు కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రాజెక్ట్ డిజైన‌ర్ ఏ.ఎస్‌. ప్ర‌కాష్ నేతృత్వంలో భారీ సెట్ ని ఏర్పాటు చేశారు. ఇందులోనే ప్ర‌స్తుతం యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మొద‌లైంది.

ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ చిత్ర బృందం 'ఆరంభం' పేరుతో ఓ వీడియోని విడుద‌ల చేసింది. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన ఈ వీడియోకు #SSMB28Arambham అంటూ హ్యాష్ ట్యాగ్ ని జోడించింది.

దీంతో సోష‌ల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ గంట‌ల వ్య‌వ‌ధిలోనే వైర‌ల్ గా మారి ట్రెండింగ్ గా మారింది. దీంతో ఈ మూవీపై స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది. సినిమాకు 'ఆరంభం' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేస్తున్నారు కాబ‌ట్టే హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట వైర‌ల్ అయ్యేలా చేశార‌నే కామెంట్ లు మొద‌ల‌య్యాయి.

త్రివిక్ర‌మ్ చేసిన సినిమా టైటిల్ లని ఒక‌సారి ప‌రిశీలిస్తే #SSMB28 కు 'ఆరంభం' అనే టైటిల్ ని ఖ‌రారు చేసే ఆలోచ‌న‌లో త్రివిక్ర‌మ్ వున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అత‌డు, అఆ, అత్తారింటికి దారేది', అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ పుర‌ములో' వంటి సినిమాల‌ని బ‌ట్టి ఏ సెంటిమెంట్ ప్ర‌కారం మ‌హేష్ #SSMB28 కు 'ఆరంభం' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం కూడా వుంద‌ని తెలుస్తోంది.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్నఈ మూవీకి పీఎస్ వినోద్ ఫొటోగ్ర‌ఫీ, ఏ.ఎస్ ప్ర‌కాష్ క‌ళా ద‌ర్శ‌క‌త్వం, ఎడిటింగ్ న‌వీన్ నూలి, ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టించ‌నున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.