Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కంటే ముందు నారా రోహిత్
By: Tupaki Desk | 14 Sep 2017 5:30 PM GMTవచ్చే గురువారం విడుదలయ్యే ‘జై లవకుశ’లో జూనియర్ ఎన్టీఆర్ రావణాసురుడిని తలపించే పాత్రను చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో జై పాత్ర రావణుడి స్ఫూర్తితో తీర్చిదిద్దుకున్న పాత్రే. ఈ సినిమా ప్రోమోల్లో కూడా ఆ విషయాన్ని ఇండికేట్ చేస్తున్నారు. ఐతే దాని కంటే ముందు వారం విడుదలవుతున్న ‘కథలో రాజకుమారి’లో నారా రోహిత్ క్యారెక్టర్ సైతం రావణాసురుడి పాత్ర స్ఫూర్తితో అల్లుకున్నదే అంటున్నాడు దర్శకుడు మహేష్ సూరపనేని.
ఈ సినిమాలో రోహిత్ దాదాపుగా విలన్ రోల్ చేస్తున్నట్లే అని అతను చెప్పాడు. ఈ పాత్రకు చాలా అవలక్షణాలు ఉంటాయని.. ఊరికే పైపైన నెగెటివ్ టచ్ ఉండటం కాకుండా పూర్తి స్థాయి విలన్ లాగా అతను ప్రవర్తిస్తాడని.. కథానాయికను నాశనం చేయాలని అతను చూస్తాడని.. చివరికి ఆ కథానాయిక వల్లే అతనెలా మారాడన్నది ఇందులో చూపించామని మహేష్ తెలిపాడు.
‘కథలో రాజకుమారి’ విడుదల అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని.. కానీ ఇప్పుడిది సరైన సమయంలోనే రిలీజవుతోందని భావిస్తున్నామని మహేష్ చెప్పాడు. ఈ సినిమా ఫలితంపై తనకెలాంటి టెన్షన్ లేదని.. ఔట్ పుట్ అంత బాగా వచ్చిందని అతనన్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరికి సినిమా చూపించగా.. వాళ్లందరూ మెచ్చుకున్నారని.. ఈ సినిమా టీజర్-ట్రైలర్ తోనే ఇంప్రెస్ అయిన కొందరు తన తర్వాతి సినిమా కోసం సంప్రదించారని మహేష్ చెప్పాడు.