Begin typing your search above and press return to search.
బ్రహ్మోత్సవం రిలీజ్.. మహేష్ జంప్
By: Tupaki Desk | 16 May 2016 1:30 PM GMTమే 20.. అభిమానులు బ్రహ్మోత్సవం జరుపుకునే డేట్. ఆ రోజునే మహేష్ బాబు మళ్ళీ తాజా రికార్డులు ఏమైనా కొడతాడేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. మొన్ననే శ్రీమంతుడు సినిమాతో బాహుబలి తరువాత సెకండ్ బెస్ట్ అనిపించుకున్న సూపర్ స్టార్.. తన స్థానాన్ని తనే మరోసారి ఛాలెంజ్ చేస్తాడేమోనని అందరూ ఆశగా చూస్తున్నారు మరి.
ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. అసలు రిలీజ్ రోజున జనాల రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడటానికి మహేష్ ఉండట్లేదు. అవును.. ఆ మధ్యన శ్రీమంతుడు సినిమా రిలీజయ్యాక ప్యారిస్ వెళ్లిన మహేష్ బాబు.. ఆ తరువాత న్యూ ఇయర్ టైమ్ లో దుబాయ్ వెళ్లి అక్కడి నుండి చక్కగా స్విట్జర్ ల్యాండ్ వెళ్ళాడు. అయితే సరిగ్గా అనుకున్నట్లు ఏప్రియల్ లో బ్రహ్మోత్సవం రిలీజ్ అయ్యుంటే.. మనోడు హ్యాపీగా కాస్త ఎర్లీగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేవాడు. కాని బ్రహ్మోత్సవం కోసం దాదాపు మే మధ్యంతరం వరకు వర్కు చేయాల్సి రావడంతో ఈసారి ఫ్యామిలీ ట్రిప్ లేటయ్యింది.
కాకపోతే ముందుగా మే 6న బ్రహ్మోత్సవం అనుకున్నారు కాబట్టి.. 16 నుండి ఫారిన్ వెళ్ళాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారట. ఇప్పుడు మే 20న బ్రహ్మోత్సవం వస్తున్నా కూడా.. మహేష్ టన టూర్ షెడ్యూల్ మార్చట్లేదు. రిలీజ్ కు రెండు రోజుల ముందే హీరోగారు జంప్ జిలానీ. సినిమా విడుదలయ్యాక ఇంటర్యూలు ఇవ్వడం కుదరదనే.. ఇలా ముందుగానే కాసినన్ని ఎక్కువ ఇంటర్యూలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.