Begin typing your search above and press return to search.
మహేష్ - త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా.. లేనట్టా?
By: Tupaki Desk | 18 Dec 2021 10:43 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రాన్ని పూర్తి చేసే పనుల్లో వున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో మైత్రీ మూవీమేకర్స్ , 14 రీల్స్ ప్లస్, మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ తరువాత వెంటనే సెట్స్ పైకి త్రివిక్రమ్ సినిమా రానుంది. ఈ ప్రాజెక్ట్ ని ఇటీవలే ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ప్లాన్ చేశారు. అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఇప్పటికు చిత్ర బృందం ఓ వీడియోని కూడా విడుదల చేసింది.
ఈ ఏడాది నవంబర్ లో సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇంత వరకు దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. ఈ రోజు .. రేపు అంటూ వాయిదా పడుతూ వస్తోంది. అయితే చిత్ర వర్గాలు ఫైనల్ గా ఈ మూవీని జనవరి నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రయత్నాలకు కూడా తాజాగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. కారణం గతంలో `స్పైడర్` సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ మోకాలికి గాయమైంది. అది ఇప్పటికీ బాధిస్తుండటంతో పరీక్షించిన డాక్టర్లు మహేష్ కు శస్త్ర చికిత్స అవసరమని తేల్చేశారట.
దీంతో శస్త్ర చికిత్స కోసం మహేష్ బాబు స్పెయిన్ వెళ్లిపోయారు. అక్కడే మోకాలికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నారు. అనంతరం విశ్రాంతి కోసం దుబాయ్ కి రానున్నారట. మహేష్ చేరుకున్న మరుక్షణమే హైదరాబాద్ నుంచి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారతో కలిసి నమ్రత దుబాయ్ కి చేరుకుంటారని, అక్కడే మహేష్ తన ఫ్యామిలీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారని ఇటీవల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్ తిరిగి రానున్న మహేష్ విశ్రాంతి తీసుకున్న తరువాతే `సర్కారు వారి పాట`కు సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసి రెండు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుంటారట.
ఆ తరువాత రాజమౌళి సినిమా కు డేట్స్ కేటాయించనున్నారట. దీంతో మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇంతకీ మహేష్ - త్రివిక్రమ్ సినిమా వున్నట్టా? లేనట్టా అని అంతా చర్చించుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు మహేష్ డేట్స్ కేటాయిస్తే మాత్రం త్రివిక్రమ్ సినిమా లేనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దాదాపు 11 ఏళ్ల విరామం తరువాత మహేష్ - త్రివిక్రమ్ ల కలయికలో సినిమా అంటూ హడావిడి చేసినా అభిమానులకు నిరాశే ఎదురు కావడంతో అంతా ఒక్కసారిగా ఉసూరు మంటూ నిట్టూరుస్తున్నారు. పోనీ త్రివిక్రమ్ కు ఏమైనా ఆప్షన్ లు వున్నాయా అంటే అవి కూడా లేదు. పవన్, అల్లు అర్జున్ తో పాటు రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్ట్ లలో బిజీగా వున్నారు. త్రివిక్రమ్ మళ్లీ నితిన్ తరహా హీరోతో ఏదైనా సినిమా చేసుకోవాల్సిందే అంటున్నారు.