Begin typing your search above and press return to search.
మహేష్ వెర్సస్ బన్నీ.. ఎవరి స్ట్రాటజీ వాళ్లదే
By: Tupaki Desk | 27 Dec 2019 10:18 AM GMTసంక్రాంతి కి టాలీవుడ్ బాక్సాఫీస్ లో రసవత్తర సమరం చూడబోతున్నాం. మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు చిత్రాల్నీ ఒకే రోజు.. జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ఇది రెండు సినిమాలకూ మంచిది కాదన్న ఉద్దేశం తో ‘సరిలేరు..’ను ఒక రోజు ముందుకు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లో కూడా ఈ సినిమాల్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ మామూలు గా అయితే మహేష్ బాబు కే మార్కెట్, ఫాలోయింగ్ ఎక్కువ. ఐతే ఈసారి మహేష్ చేస్తున్నది మాస్ సినిమా కాగా.. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కి దగ్గరగా ఉండే ఛాయలు కనిపిస్తుండటం ‘అల వైకుంఠపురము లో’కు అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. మహేష్ తో పోలిస్తే బన్నీ అక్కడ వీకే కానీ.. ఈసారి సినిమా కంటెంట్, త్రివిక్రమ్ ఫ్యాక్టర్ అతడి కి కలిసొచ్చేలా ఉన్నాయి.
ఇక యుఎస్ రిలీజ్ విషయం లో ‘సరిలేరు..’, ‘అల..’ సినిమా లో డిఫరెంట్ స్ట్రాటజీల తో అడుగులు వేస్తున్నాయి. మహేష్ సినిమాల కు మామూలు గా అక్కడ డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎప్పట్లాగే ప్రిమియర్ల కు 20-25 డాలర్ల మధ్య టికెట్ రేట్లు పెట్టి వసూళ్ల మోత మోగించుకోవడానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత యుఎస్‌లో రిలీజయ్యే భారీ చిత్రం కాబట్టి డిమాండ్ బాగానే ఉంటుందని.. రేటు ఎక్కువ పెట్టొచ్చని అనుకుంటున్నారు. ఐతే ‘అల..’ టీం స్ట్రాటజీ మరోలా ఉంది. ఆల్రెడీ ‘సరిలేరు..’ రిలీజై ఉంటుంది. పోటీ గా వెళ్లే తమ సినిమా కు అంత రేటు పెడితే కష్టమని 14 డాలర్ల రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రిమియర్లు పడేది శనివారం. అది వీకెండ్ కాబట్టి రోజు మొత్తం ప్రిమియర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘సరిలేరు..’ కంటే ఎక్కువ ప్రిమియర్ షోలు దీనికి వేయాలనుకుంటున్నారు. మరి ఈ రెండు సినిమాల బయ్యర్ల ప్రణాళికల్లో ఎవరివి ఎంత మేరకు వర్కవుటై.. ఏది ప్రిమియర్లలో, వీకెండ్లో పైచేయి సాధిస్తుందో చూడాాలి.