Begin typing your search above and press return to search.

మహేష్ vs పవన్ ఫ్యాన్స్.. ఫన్నీ ట్వీట్ వార్..!

By:  Tupaki Desk   |   26 Jan 2022 7:35 AM GMT
మహేష్ vs పవన్ ఫ్యాన్స్.. ఫన్నీ ట్వీట్ వార్..!
X
సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ అనేది కామన్ గా ఉండేదే. బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా నిలిచే హీరోల అభిమానులు కూడా ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకప్పుడు థియేటర్ల వద్ద హద్దులు మీరి ఇతర హీరోల ఫ్యాన్స్ తో ఘర్షణలకు దిగి రక్తం చిందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫ్యాన్ వార్ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతోంది. తమకు నచ్చని హీరోలని కించపరుస్తూ అభ్యంతరకరమైన కామెంట్స్.. అసభ్యకరమైన ఎడిటింగ్ ఫోటోలతో నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఒకరి మీద ఫన్నీ మీమ్స్ తో ఫైట్ చేసుకునే సందర్భాన్ని క్రియట్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్‌ అభిమానులు 'వకీల్ సాబ్' సినిమాలో స్టార్ హీరోకి సంబంధించిన మూడు డిఫరెంట్ లుక్స్ ని పోస్ట్ చేశారు. లా స్టూడెంట్ - లాయర్ మరియు గడ్డంతో ఉన్న లుక్స్ ని ఇందులో చూడొచ్చు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో నుండి అతని జీవితకాలంలో ఇలాంటివి ఆశించలేరు.. 'ముఖ్యంగా గడ్డంతో ఉన్న ఆ చివరి లుక్' అని పీకే ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు. దీంతో మహేష్ అభిమానులు పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. 'వకీల్ సాబ్' లో పవన్ డూప్ నటించిన ఫోటోలను జత చేయడం మర్చిపోయారంటూ కౌంటర్ అటాక్ చేశారు.

అంతేకాదు 'మహర్షి' సినిమాలో మహేష్ మూడు విభిన్నమైన గెటప్స్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు స్టూడెంట్ గా సూపర్ స్టార్ గడ్డంతో కనిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా పవన్ - మహేష్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో ఫన్నీ ట్వీట్ వార్‌ జరిగింది. అయితే పవన్ - మహేష్ ఇద్దరూ తమ సినిమాలలో గత కొన్నేళ్లుగా ఒకే లుక్ ని మెయింటైన్ చేస్తూ.. పెద్దగా మేకోవర్ ప్రయత్నించని హీరోలు కావడంతో ఇతర హీరోల ఫ్యాన్స్ కి ఈ వార్ ఫన్నీగా కనిపిస్తోంది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు కెరీర్ ప్రారంభం నుంచి లుక్ అండ్ గెటప్ వైజ్ పెద్దగా వేరియేషన్స్ చూపించలేదు. కథల పరంగా ప్రయోగాలు చేసినప్పటికీ.. ఎప్పుడూ తన హెయిర్‌ స్టైల్‌ లో మాత్రమే వేరియేషన్ చూపిస్తూ వచ్చారు. ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు స్టార్ హీరోలు ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తే చూడాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే చాలా ఏళ్ల తర్వాత స్టార్ హీరోలిద్దరూ మూడు లుక్స్ లో కనిపించడంతో దాన్ని స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. కాకపోతే వీరు చాలా అరుదుగా మేకోవర్ కోసం ట్రై చేసే హీరోలు కావడంతో.. ఈ ట్వీట్ వార్ ఇతర స్టార్ల ఫ్యాన్స్ కు ఫన్నీగా అనిపిస్తోంది