Begin typing your search above and press return to search.

ఇట‌లీ వీధుల్లో మ‌హేష్ వాకింగ్!

By:  Tupaki Desk   |   14 Jun 2022 9:31 AM GMT
ఇట‌లీ వీధుల్లో మ‌హేష్ వాకింగ్!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ వెకేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇట‌లీ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్ప‌టికే యూరప్ రోడ్ ట్రిప్ కి సంబంధించిన కొన్ని ఫోటోల్ని సూప‌ర్ స్టార్ ఇన్ స్టా వేదిగా పంచుకున్నారు. తాజాగా ఇట‌లీ విను విధుల్లో మ‌హేష్ ఎంత హ్యాపీగా తిరుగుతున్నారో ఈ వీడియో చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది.

`స‌మ్మ‌ర్ వాక్ విత్ నాన్న` అంటూ త‌న‌య సితార ఈ వీడియోని ఇన్ స్టారీల్ ద్వారా షేర్ చేసింది. ఇందులో తండ్రీ -కూతుళ్లు ఇద్ద‌రు ఉద‌యం వాకింగ్ వెళ్లిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇట‌లీ రోడ్ల‌పై ఎలాంటి ఆట‌కం లేకుండా ఓ సాధార‌ణ పౌరుడిలా మ‌హేష్ వాక్ చేసుకూంటు వెళ్లిపోతున్నారు. ప‌క్క‌నే సితార తండ్రి తో పాటు క‌లిసి వాక్ చేస్తుంది.

చుట్టూ అంద‌మైన గ్రీన‌రీ రోడ్డుకి ఓవైపుగా అంతే అంద‌మైన ఇళ్లు..మ‌ధ్య‌లో రోడ్ ..దానిపై ప్రిన్స్..సితార అలా వాక్ చేసుకుంటూ వెళ్ల‌డం చూప‌రుల్ని ఆక‌ట్టుకుంటుంది ప్రస్తుతం వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు తండ్రీ-కుమార్తెని అలా చూసి మురిసి పోతున్నారు. ఆస‌క్తిక‌ర కామెంట్ల‌తో అభిమానం చాటుకుంటున్నారు.

ఇంత స్వేచ్ఛ‌గా హైదరాబాద్ లో వాక్ చేయ‌డం కుద‌ర‌దు. అభిమానులు..ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో స్వేచ్చ‌గా ఉండ‌టానికి
సెల‌బ్రిటీల‌కు సాధ్య‌ప‌డ‌దు కాబ‌ట్టి..ఆ అనందాన్ని ఇలా వెకేష‌న్ కి వెళ్లిన‌ప్పుడు తీర్చుకుంటుంటారు. మ‌హేష్ ఏడాదికి క‌నీసం నాలుగ‌దు సార్లు అయిన ఆవెకేష‌న్ కి వెళ్తుంటారు. హైద‌రాబాద్ లో కోల్పోతున్న స్వేచ్ఛ మొత్తాన్ని ఇలా వెకేష‌న్ కి వెళ్లిన‌ప్పుడు తిరిగి పొందుతుంటారు.

ఇదెంతో రీప్రెషింగ్ గా అనిపిస్తుంది. కొత్త సినిమా షూటింగ్ లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటారు. అందుకే మ‌హేష్ సినిమా రిలీజ్ కాగానే వెకేష‌న్ కి వెళ్లిపోతారు. ఓ ప‌ది-ప‌దిహేను రోజులు విదేశాల్లోనే గ‌డుపుతారు. అటుపై హైదారాబాద్ కి తిరిగి రాగానే ప్రెష్ గా కొత్త సినిమా షూట్ లో జాయిన్ అవుతుంటారు.

ఇట‌లీ నుంచి తిరిగి రాగేనే మ‌హేష్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌ను సినిమాని సెట్స్ కు తీసుకెళ్ల‌నున్నారు. ఇప్ప‌టికే అన్ని ర‌కాల ప‌నులు పూర్తిచేసి త్రివిక్ర‌మ్ సిద్దంగా ఉన్నారు. హైద‌రాబాద్ లో మొద‌టి షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇంందులో హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టిస్తుంది.