Begin typing your search above and press return to search.
మహేష్ భలే తప్పించుకున్నాడే!
By: Tupaki Desk | 12 Nov 2018 11:21 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఏఎంబీ సినిమాస్ బ్రాండ్ తో తెలుగు రాష్ట్రాల్లో చైన్ మల్టిప్లెక్సులను నెలకొల్పడానికి రెడీ అవుతున్నాడన్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ ఈ బిజినెస్ టేకప్ చేశాడు. ఇప్పటికే గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్ నిర్మాణం పూర్తయింది. ఈ మల్టిప్లెక్స్ ను నవంబర్ 8 న ప్రారంభించాలని అనుకున్నాడు మహేష్.
అమీర్ ఖాన్ ను మల్టిప్లెక్స్ ఓపెనింగ్ కి పిలవాలని.. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' మల్టిప్లెక్స్ లో మొదటి సినిమాగా ఉండాలని భావించాడట. కానీ అమీర్ ఖాన్ మాత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ప్రచారాన్ని తన గత సినిమాల లాగా చేయలేదు.. ఊరూరూ తిరగలేదు. మరి తనకు ముందే 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' సినిమా ఫలితం తెలుసేమో గానీ హైదరాబాద్ ప్రమోషన్స్ పెట్టుకోలేదు. దీంతో మహేష్ కూడా తన ప్లాన్స్ మార్చుకున్నాడట. ఈ నెలాఖరులో '2.0' సినిమా తో ఓపెన్ చేయాలని చూస్తున్నాడట. మల్టిప్లెక్స్ ఓపెనింగ్ కి రజనీకాంత్ - శంకర్ ఇద్దరినీ పిలవాలని అనుకుంటున్నాడట.
ఏదేమైనా మహేష్ మల్టిప్లెక్స్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' లాంటి డిజాస్టర్ తో ఓపెన్ అయ్యే పరిస్థితిని తప్పించుకుందని... ఒక రకంగా మంచిదే అని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టిప్లెక్స్ ను సుపర్ స్టార్ రజనీకాంత్ '2.0' లాంటి క్రేజీ ప్రాజెక్టుతో ప్రారంభించడం సూపరే కదా.