Begin typing your search above and press return to search.
మహేష్ 4 ఏళ్ల వయసులోనే.. నేడు అరుదైన రోజు
By: Tupaki Desk | 29 Nov 2022 12:36 PM GMTసూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెరంగేట్రం చేసిన మహేష్ బాబు అనతికాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎదిగాడు. తండ్రి నీడ నుండి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుని బయటకు వచ్చేసిన మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి నేటికి 43 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉందా.. నిజంగానే నేడు అరుదైన రోజు.
మహేష్ బాబు వయసే అంత ఉంటుందా.. ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టి 43 ఏళ్లు అవ్వడం ఏంటీ అంటూ చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. అసలు విషయం ఏంటీ అంటే రమేష్ బాబు హీరోగా పరిచయం అయిన నీడ సినిమాలో మహేష్ బాబు నటించాడు. అప్పుడు మహేష్ బాబు వయసు 4 సంవత్సరాలు.
దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన నీడ సినిమా లో రమేష్ బాబు హీరోగా నటించగా ఆర్ నారాయణ మూర్తి కీలక పాత్రలో కనిపించాడు. మహేష్ బాబు కు కూడా చిన్న పాత్ర దక్కింది. అందుకే నేడు మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి 43 ఏళ్లు పూర్తి అయ్యింది.
మహేష్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమా ల్లో నటించాడు. స్కూల్స్ కి హాలీడే వస్తే చాలు ఏదో ఒక సినిమాలో మహేష్ బాబు నటించేవాడని.. ఎక్కువగా ఊటీలో సినిమాల షూటింగ్స్ జరిగేవని మహేష్ బాబు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల సినీ కెరీర్ ను కలిగి ఉన్న స్టార్స్ లో అరుదైన స్టార్ మహేష్ బాబు.
ఇక మహేష్ బాబు ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ వరుస విషాదాల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. డిసెంబర్ లో సినిమా ప్రారంభం అవ్వబోతుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ బాబు చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా హడావుడి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.