Begin typing your search above and press return to search.

సెట్ లో స్వీట్ డాట‌ర్ తో మ‌హేష్..ఫ్యాన్స్ ఫిదా!

By:  Tupaki Desk   |   30 Aug 2022 8:33 AM GMT
సెట్ లో స్వీట్ డాట‌ర్ తో మ‌హేష్..ఫ్యాన్స్ ఫిదా!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ డాన్స్ ఇండియా డాన్స్ షోకి డాట‌ర్ సితార‌తో క‌లిగి అతిధిగా వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ తొలిసారి బుల్లి తెర రియాల్టీ షోకి వెళ్ల‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అదీ సితార‌తో హాజ‌ర‌వ్వ‌డం అభిమానుల్లో మ‌రింత జోష్ ని నింపుతుంది. ఆ ఇద్ద‌ర్ని ఎప్పుడు చూస్తామా? అని ఒక‌టే ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.

ఇప్ప‌టికే షోకి సంబంధించిన‌ ప్రోమో ఒక‌టి వైర‌ల్ గా మారింది. అందులో మ‌హేష్-సితార ని గ్రాండ్ గా వెల్క‌మ్ చేసారు. రెడ్ కార్పెట్ పై తండ్రి-త‌న‌యులు న‌డుచుకుంటూ వ‌స్తోన్న వైనం అభిమానుల్ని ఓ రేంజ్ లో ఆక‌ట్టుకుంటుంది. నాకు తెలిసి డాన్స్ అనేది సెల‌బ్రేష‌న్. మా అమ్మాయితో ఈ షోకి రావ‌డం నిజంగా చాలా ఆనందంగా ఉందంటూ మ‌హేస్ సంతోషాన్ని వ్య‌క్తం చేసారు.

ఇక సితార లో డాన్సింగ్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. షోలో సితార సైతం దుమ్ముదులిపేసిన‌ట్లు ప్రోమో చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. మ‌హేష్ ఫుల్ హ్యాండ్స్ టీష‌ర్ట్..బ్లాక్ ఫ్యాంట్ లో క‌నిపిస్తున్నారు.

సితార ఔట్ ఫిట్ లో మెరుపులతో మురిపిస్తుంది. ప్రోమో చూస్తుంటే సితార కోస‌మే మ‌హేష్ వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. డాన్స్ పై త‌న ప్రేమ‌నంత‌టిని షోలో సితార చూపించి ఉండొచ్చు.

మ‌హేష్ గారాల ప‌ట్టి సితార‌. అచ్చం మ‌హేష్ త‌ల్లి పోలిక అంటూ తెగ మురిసిపోతారు ప్రిన్స్. మ‌రి ఆ త‌ల్లి కోరికని మ‌హేష్ ఎలా కాద‌న‌గ‌ల‌డు. సితార‌తో క‌లిసి హాజ‌ర‌వుతున్న తొలి షో కూడా ఇదే కావొచ్చు. గ‌తంలో సితార మ‌హేష్‌ని సోష‌ల్ మీడియా ఏదిక‌గా కొన్ని ఇంట‌ర్వ్యూలు చేసింది. అవి నెట్టింట జోరుగా వైర‌ల్ అయ్యాయి.

మ‌రి ఈ రియాల్టీ డాన్స్ షోలో ఎలాంటి ప్ర‌త్యేక‌త‌లున్నాయో చూడాలి. ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 28వ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా సెప్టెంబ‌ర్ రెండ‌వ వారంలో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ఈ ఖాళీ స‌మ‌యాన్ని మ‌హేష్ పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించారు. అలా వీలు కుద‌ర‌డంతోనే? డాన్స్ ఇండియా ఇండియాన్స్ కి హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.