Begin typing your search above and press return to search.

మరోసారి గొప్ప మనస్సును చాటుకున్న సూపర్ స్టార్..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 6:34 AM GMT
మరోసారి గొప్ప మనస్సును చాటుకున్న సూపర్ స్టార్..!
X
టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. నెంబర్ వన్ రేసులో మహేష్ బాబు ఎప్పుడో చేరిపోయాడు. గత కొన్నేళ్లుగా మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకెళుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. 'భరత్ అనే నేను'.. 'మహర్షి'.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో మహేష్ బాబు హట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు.

ఈ ఏడాది 'సర్కారు వారి పాట'తో మరో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబును దర్శకుడు పర్శురాం సరికొత్త లుక్కులో చూపించారు. రోజురోజుకీ మహేష్ బాబు అందం పెరగడమే గానీ తగ్గదు అన్నట్లుగా ఈ మూవీలో ఆయన కన్పించారు. మహేష్ కు జోడీగా 'మహానటి' కీర్తి సురేష్ నటించింది.

వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారి వచ్చిన సినిమానే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దీంతో అటూ కీర్తి ఫ్యాన్స్.. ఇటూ మహేష్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి 'ఎస్ఎస్ఎంబీ28' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే మహేష్ బాబు తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది చిన్నారులకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయించి వారందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దీంతోపాటు తాను గతంలో దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

తాజాగా మరోసారి మహేష్ బాబు తన గొప్ప మనస్సును చాటుకున్నారు. బుర్రిపాలెం గ్రామంలోని సర్కారు బడిలో డిజిటల్ లెర్నింగ్ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ఫౌండేషన్ సహాయం అందించింది. ఈ విషయాన్ని బుర్రిపాలెం పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సోషల్ మీడియా ద్వారా పంచుకొని మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు తమ హీరో చేసిన పనికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు సైతం మహేష్ బాబు నిజంగా సూపరహే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.