Begin typing your search above and press return to search.

బాబు గారు.. స్మార్ట్ స్టైల్ చంద్రుడు..

By:  Tupaki Desk   |   21 March 2023 9:46 AM GMT
బాబు గారు.. స్మార్ట్ స్టైల్ చంద్రుడు..
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో త్రివిక్రమ్ స్టైల్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ మూవీ తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ని త్రివిక్రమ్ ఉగాది సందర్భంగా ఇవ్వబోతున్నాడు అనే సంగతి తెలిసిందే.

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరిస్తారని మెజారిటీ ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మూవీకి సంబందించిన టైటిల్ ఎనౌన్స్మేంట్ కాకపోవడంతో అదే జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇండియాలోనే స్టార్ హీరోలలలో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేసే స్టార్ గా మహేష్ బాబు ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. హిందీ హీరోలని సైతం వెనక్కి నెట్టి అతను ఎండార్స్మెంట్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

సాఫ్ట్ డ్రింక్ ప్రొడక్ట్స్ కి ఎక్కువగా మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. అలాగే ఫ్యాషన్ స్టోర్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ కమర్షియల్ గా ఇండియన్ వైడ్ గా అందరికి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబందించిన ఒక కమర్షియల్ య ఆడ షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ యాడ్ షూట్ లో మహేష్ బాబు లుక్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కి ఆసక్తి పెంచుతున్నాయి. అసలే అందగాడు దానికి స్టైలిష్ జోడిస్తే మహేష్ నెక్స్ట్ లెవల్ లో హ్యాండ్ సమ్ గా ఉంటాడు అని సూపర్ స్టార్ అభిమానులు ఆ వీడియో చూసి కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. గ్రీన్ కలర్ షూట్ లో అదిరిపోయే లుక్స్ తో ఈ యాడ్ లో మహేష్ బాబు మెస్మరైజ్ చేస్తూ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.