Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకోకుండానే తల్లైన మరో హీరోయిన్
By: Tupaki Desk | 3 July 2019 6:41 AM GMTబాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మిత సేన్ పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన విషయం తెల్సిందే. అలాగే పలువురు స్టార్స్ కూడా పెళ్లి చేసుకోకుండానే తల్లి దండ్రులు అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోకుండానే తల్లిని అయినట్లుగా ప్రకటించింది. బాలీవుడ్ లో వచ్చిన 'దేవ్ డీ' చిత్రంలో నటించిన మహీగిల్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.
మహీగిల్ మాట్లాడుతూ.. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవద్దని మాత్రం అనుకోవడం లేదు. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో అప్పుడు చేసుకుంటాను. అయితే నాకు ఒక పాప ఉందని చెప్పేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పాపకు ఈ ఆగస్టుతో మూడు సంవత్సరాలు వస్తాయి అంది. ప్రస్తుతం నా కూతురితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆమె నా సర్వస్వం అన్నట్లుగా బతుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
గతంలో మీకు కూతురు ఉన్నట్లుగా ఎందుకు చెప్పలేదు.. ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పారు అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించగా గతంలో తనను మీకు కూతురు ఉందా అంటూ ఎవరు ప్రశ్నించలేదు. అందుకే అప్పుడు చెప్పలేదు అంటూ గడుసుగా సమాధానం ఇచ్చింది. పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కలిగి ఉండటంను తానేం సమస్యగా పరిగణించడం లేదు. ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది.. దానికి తగ్గట్లుగా వారు సిద్దాంతాలు ఏర్పర్చుకుంటారు. నా సిద్దాంతాలు నాకున్నాయంటూ మహీగిల్ పేర్కొంది.