Begin typing your search above and press return to search.

పోర్న్‌ బ్యాన్‌ కాదు - ఇలా చేయండి!!

By:  Tupaki Desk   |   31 Oct 2018 12:02 PM GMT
పోర్న్‌ బ్యాన్‌ కాదు - ఇలా చేయండి!!
X

దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలకు - ఆడవారిపై జరుగుతున్న దాడులకు పోర్న్‌ మూవీస్‌ అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 2015లోనే పోర్న్‌ వెబ్‌ సైట్లను బ్యాన్‌ చేయాలని నిర్ణయించుకుంది. కాని అప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు చేయడంలో విఫలం అయ్యింది. మళ్లీ ఇప్పుడు పోర్న్‌ సైట్లను బ్యాన్‌ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్దం చేశారు. అక్టోబర్‌ 27 నుండి 827 పోర్న్‌ సైట్లను బ్యాన్‌ చేయాల్సిందే అంటూ ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను భారత టెలికాం శాఖ ఆదేశించింది.

పోర్న్‌ బ్యాన్‌ పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. కొందరు పోర్న్‌ బ్యాన్‌ ను సమర్ధిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పోర్న్‌ బ్యాన్‌ గురించి కొందరు మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. వర్మ వంటి వారు పోర్న్‌ బ్యాన్‌ చేయవద్దని మొదటి నుండి డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా టీవీ ఆర్టిస్టు మహికా శర్మ పోర్న్‌ బ్యాన్‌ గురించి మాట్లాడుతూ కేంద్రంపై దుమ్మెత్తి పోషింది. పోర్న్‌ బ్యాన్‌ చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని - పైపెచ్చు రేప్‌ లు ఇంకా పెరగడంతో పాటు - ఆడవారిని అసభ్యంగా చిత్రీకరించి - ఆ వీడియోలను వైరల్‌ చేస్తారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

పోర్న్‌ నిషేదించడం ఒక గొప్ప నిర్ణయంగా కేంద్రం భావిస్తుంది. కాని వారు చేసింది పెద్ద తప్పుడు పని అంటూ మహికా పేర్కొంది. అసభ్య వీడియోల కల్చర్‌ ఎక్కువ అవుతుంది, అప్పుడు అమ్మాయిలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందని మహికా అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశంలో పోర్న్‌ బ్యాన్‌ చేయడం కాకుండా సెక్స్‌ గురించి నలుగురు మాట్లాడుకునేలా చేయాలని - సెక్స్‌ గురించి ఎలాంటి అరమరికలు లేకుండా మాట్లాడినప్పుడు లైంగిక వేదింపులు - రేప్‌ లు లేకుండా ఉంటాయని ఈ సందర్బంగా మహిక శర్మ చెప్పుకొచ్చింది.

తన స్నేహితుడు డానీ డి(బ్రిటీష్‌ పోర్న్‌ స్టార్‌) ఎంతో కష్టపడి పోర్న్‌ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇకపై ఇండియాలో అతడి సినిమాలు చూడలేక పోతున్నందుకు బాధగా ఉందని మహికా శర్మ పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంను గౌరవిస్తాం - కాని ప్రజల మనోభావాలను - వారి కోర్కెలను ప్రభుత్వం పట్టించుకోవాలి. అందుకే పోర్న్‌ పై విధించిన బ్యాన్‌ ను ఎత్తి వేయాలని కోరుతున్నాను అంటూ మహికా శర్మ పేర్కొంది. మహికా శర్మ వాదనకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరి కొందరు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.