Begin typing your search above and press return to search.
90ML బాబుకు మహిళా మండళ్ల హెచ్చరిక
By: Tupaki Desk | 6 Dec 2019 4:55 AM GMT`ఆర్ ఎక్స్ 100` లాంటి బ్లాక్ బస్టర్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా అతనికి యూత్ లో భారీ క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. అయితే ఆ క్రేజ్‌ను ఆ తరువాత వచ్చిన హిప్పీ- గుణ 369 చిత్రాలు నిలబెట్టలేకపోయాయి. తాజాగా కార్తికేయ నటించిన చిత్రం `90 ఎంఎల్` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై యూత్ లో అంతో ఇంతో చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమాకి ఊహించని ఓ ప్రమాదం కూడా పొంచి వుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ఓ విచిత్రమైన జబ్బు వుంటుందట. 90 ఎంఎల్ తాగితే మాత్రమే హీరో గారు బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పడంతో మద్యం కాస్తా పిల్లాడికి పాల సీసాలా మారుతుందట. ఇదే ఇప్పుడు ఈ సినిమాకు చిక్కులు తెచ్చిపెట్టబోతోంది. ఈ సినిమా మద్యపానాన్ని ప్రేరేపించేదిలా వుందని.. ఇలాంటి చిత్రాల వల్లే నేటి యువత దారి తప్పుతున్నారని మహిళా సంఘాలు చిత్ర బృందాన్ని హెచ్చరిస్తున్నాయి.
నేడు (శుక్రవారం) రిలీజవుతున్న ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని.. ప్రసాద్స్ ఐమాక్స్ వద్ద తమ నిరసన తెలియజేస్తామని పలు మహిళా సంఘాలు ఇప్పటికే చిత్ర బృందానికి వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇకపోతే ఏపీలో దపదఫాలుగా మద్యాన్ని తగ్గిస్తూ చివరికి నిషేధించాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఈ సినిమాపై రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న చర్చా వేడెక్కిస్తోంది. సంఘంలో చెడు అలవాట్లను తగ్గించేందుకు ప్రయత్నించాలి కానీ.. పెంచేదిగా ఉంటే అలాంటి సినిమాలకు ఇలాంటి ఎటాక్స్ తప్పవు మరి.