Begin typing your search above and press return to search.
ఆ ప్లేయర్ చీట్ చేశాడన్న వెటరన్ బ్యూటీ
By: Tupaki Desk | 13 April 2020 12:30 AM GMTమోడల్ .. మాజీ మిస్ ఇండియా.. బాలీవుడ్ నటి మహిమా చౌదరి పరిచయం అవసరం లేదు. మనసులో మాట అనే చిత్రంలో నటించింది. అందానికి అందం ప్రతిభతో ఆకట్టుకున్న ఈ నటి అనంతర కాలంలో బాలీవుడ్ లోనే సెటిలైంది. చిరంజీవి - రజనీలను విపరీతంగా అభిమానించే నటీమణుల్లో మహిమ పేరు ఉంది. ఇక సినిమాలతో కంటే ఎఫైర్ తోనే ఈ అమ్మడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు... లియాండర్ పేస్ తో సుదీర్ఘ కాలం ప్రేమాయణం సాగించి చివరికి బ్రేకప్ అయిన వైనం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. లియాండర్ తనను మోసం చేశాడని వేరొకరితో కులుకుతూ తనను వదిలించుకున్నాడని పలుమార్లు బహిరంగ వేదికలపైనే మహిమ వాపోయింది. రియా పిళ్ళై అనే వేరొక యువతిని పెళ్లాడి తనని మోసం చేశాడని లియాండర్ పై పలుమార్లు విరుచుకుపడింది. కారణం ఏదైనా వ్యక్తిగత జీవితంలో కల్లోలం సినీ కెరీర్ పైనా పడింది. అప్పట్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగీ కెరీర్ పరంగా చివరికి జీరో అయిపోయింది.
మహిమా 2006 లో ఆర్కిటెక్ట్ కం వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక అందమైన కుమార్తె ఉంది. అయితే విభేదాల కారణంగా ఆ జోడీ 2011 లో విడిపోయారు. అయితే అప్పటికే మహిమా లియాండర్ పేస్ తో ఎఫైర్ సాగించిందన్న ప్రచారం ఉంది. అనంతర కాలంలో ఓ ఇంటర్వ్యూలో మహిమ మాట్లాడుతూ-``లియాండర్ మంచి టెన్నిస్ ప్లేయర్ కావచ్చు.. కానీ అతను నాతో ఫెయిర్ గేమ్ ఆడలేదు. అతను వేరొకరి(మోడల్ రియా)తో షికార్లు చేస్తున్నాడని తెలిసినప్పుడు నిజంగా షాక్ తగల్లేదు.. అతడు అంతే. నా జీవితం నుంచి అతడి నిష్క్రమణ నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి నేను ఒక వ్యక్తిగా మరింత పరిణతి చెందాను. అతను రియా (పిళ్ళై) తో కూడా అదే పని చేశాడని నేను భావిస్తున్నాను`` అని తెలిపింది. అనంతర కాలంలోనే రియా నుంచి లియాండర్ విడిపోయాడు. ఇది చాలా వరస్ట్ బ్రేక్-అప్ లలో ఒకటిగా నిలిచిపోయింది. లియాండర్ తాను రియాను ఎప్పుడూ వివాహం చేసుకోలేదని వాదిస్తే.. తాను మాత్రం ఓ హిందూ దేవాలయంలో వివాహం చేసుకున్నారని రియా వాదించింది.
కట్ చేస్తే.. మహిమాకు ఇండస్ట్రీలోనూ సత్సంబంధాలు దెబ్బ తిన్నాయి. తనను పరిశ్రమకు తీసుకువచ్చిన సుభాష్ ఘాయ్.. ఆమె పేరు మార్పు చేయడమే గాక.. రాబోయే కొన్ని తరాల పాటు ప్రజలు తనను గుర్తుంచుకునేంతటి గొప్ప సినిమాని చేసే అవకాశం ఇచ్చారు. అయితే అందుకు మహిమా ఒకానొక సందర్భంలో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మహిమ సంపాదనలో 35 శాతం తనకు చెందిన ఓ ట్రస్ట్ కి అందేలా సుభాష్ ఘాయ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ విషయంలో మహిమ మాటపై నిలబడలేదన్న ఆరోపణలు ఎదుర్కొంది. కోర్టుల వరకూ గొడవ వెళ్లినా.. ఆ తర్వాత సెటిల్ చేసుకున్నారు. అలా తనకు తొలి ఆఫర్ ఇచ్చిన గురువుతోనూ మహిమ గొడవకు దిగడం సంచలనమైంది.