Begin typing your search above and press return to search.

అబ్బాయితో సరదాగా తిరిగినా తప్పేనా..

By:  Tupaki Desk   |   19 Oct 2017 4:57 AM GMT
అబ్బాయితో సరదాగా తిరిగినా తప్పేనా..
X
ఓ అందమైన అమ్మాయి.. ఓ హ్యాండ్ సమ్ అబ్బాయి అలా సరదాగా బయటకు వెళ్లినా తప్పేనా.. దాని గురించి ఇలా రచ్చ చేయడం ఏంటి అని ఫైరయిపోతోంది పాకిస్థాన్ నటి మహీరా ఖాన్. పాక్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ సుందరాంగి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో కలిసి రయీస్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత తిరిగి సొంత భూమికి వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటోంది.

ఈమధ్య బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో కలిసి యూఎస్ లో పబ్లిగ్గా దమ్ము కొడుతూ మీడియాకు దొరికిపోయింది. ఈ ఫొటోలు చాలా వేగంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న మహీరా ఎట్టకేలకు పెదవి విప్పి మాట్లాడింది. ‘ఈ మధ్య మీడియా సెలబ్రిటీల సొంత వ్యవహారాల్లోనూ వేలు పెడుతోంది. చాలామంది నా ఫొటోలు చూసి ఇలా చేశావేంటి.. సినిమాల్లోనూ ఇలా ఎప్పుడు కనిపించలేదు అంటున్నారు. ప్రపంచం కోసం సినిమాలు చేయను. ఇది నా సొంత జీవితం. నా ఇష్టం. అయినా ఓ అమ్మాయి... ఓ అబ్బాయి అలా బయటకు వెళ్లినా తప్పేనా’’ అంటూ మహీరా తెగ కోప్పడిపోతోంది.

అయినా అడిగితే మహీరాకు ఉలుకొస్తుంది కానీ.. రణ్ బీర్ తో కలిసి చెట్టపట్టాలు వేసుకుని వీధుల్లో తిరిగి అందరూ చూస్తుండగా దమ్ముకొట్టి.. ఇది నా వ్యక్తిగత వ్యవహారం.. మీడియా జోక్యం చేసుకుంటోంది అంటూ ఎదురుదాడికి దిగడం ఎంతవరకు రైటంటారు?