Begin typing your search above and press return to search.
ఉగ్రవాదం వద్దేవద్దంటున్న షారూక్ హీరోయిన్
By: Tupaki Desk | 9 Oct 2016 11:01 AM GMTఉరీ స్థావరంపై పాక్ దాడి నేపథ్యంలో ఆ దేశానికి చెందిన బాలీవుడ్ నటుల విషయంలో ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిత్రాల్లో నటిస్తున్న పాక్ నటి మెహిరా ఖాన్ తొలిసారి ఈ అంశంపై స్పందించారు. ఉగ్రవాదం ఎక్కడున్నా తాను ఖండిస్తానని ఆమె ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు.. భారత్ లో అయినా, పాక్ లో అయినా.. ఇంకెక్కడైనా కూడా ఉగ్రవాదం కారణంగా మనుషులు చచ్చిపోవడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని ఆమె ప్రకటించారు.
సెప్టెంబరు 18 నాటి యూరీ ఉగ్రదాడి అనంతరం మెహిరా తొలిసారి స్పందించి ఉగ్రవాదం విషయంలో గళం విప్పారు. ఇంతవరకు మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు ఫేస్ బుక్ వేదికగా తన భావాలను పంచుకున్నారు. బాలీవుడ్ లో క్రమంగా ఎదుగుతున్న ఆమె ‘‘ఒక పాకిస్థానీగా.. ప్రపంచ పౌరురాలిగా ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.. యుద్ధం, రక్తపాతం నాకు ఇష్టం లేదు. యుద్దం - రక్తపాతం లేని ప్రపంచంలో నా పిల్లలు పెరగాలనుకుంటున్నాను. శాంతి - సౌభ్రాతృత్వం వెల్లివిరియాలన్నదే నా ఆకాంక్ష’’ అంటూ ఆమె నిన్న ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారు.
కాగా మరో బాలీవుడ్ నటుడు - పాకిస్థానీ అయిన ఫవాద్ ఖాన్ కూడా ఉగ్రవాదాన్ని ఇంతకుముందే తీవ్రంగా ఖండించారు. శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఉరీ దాడి అనంతరం మహారాష్ట్రకు చెందిన నవనిర్మాణ సేన పార్టీ మన దేశంలో ఉన్న పాకిస్థాన్ కళాకారులకు తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. దేశం విడిచిపోవాలని కూడా వారికి నవ నిర్మాణ సేన వార్నింగు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పాక్ నటులు గొంతు విప్పుతూ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నారు. ఇంతకుముందు భారత పౌరసత్వం ఉన్న పాక్ గాయకుడు అద్నాన్ సమీ కూడా భారత్ కే మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/