Begin typing your search above and press return to search.

పాక్ భామ క్లాసిక్ భలేగుందిలే

By:  Tupaki Desk   |   18 April 2018 5:26 AM GMT
పాక్ భామ క్లాసిక్ భలేగుందిలే
X
పాకిస్తానీ భామలు ఇండియాలో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నించడం చూస్తుంటాం. కానీ ఈ మధ్య కొన్ని వివాదాల కారణంగా పాక్ యాక్టర్స్ ను తీసుకోవడం పూర్తిగా మానేశారు. చివరగా ఇలా మన ముందుకొచ్చిన భామ మహిరా ఖాన్. షారూక్ ఖాన్ రయీస్ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఇండియన్ ఫిలిం లవర్స్ ను మెప్పించింది.

సోషల్ మీడియాలో ఈమె మహా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 'జహా మై జాతీ హు వహీ చలే ఆతే హో' అంటూ సాగే పాత హిందీ పాటకు డబ్ స్మాష్ మాదిరిగా రీక్రియేట్ చేసింది మహిరా ఖాన్. రాజ్ కపూర్-నర్గీస్ దత్ లు నటించిన ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్. 1956లో వచ్చిన చోరీ చోరీ మూవీలోని ఈ పాటను.. మహిరా ఖాన్ తనదైన శైలిలో మెప్పించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇలాంటి వీడియోలతో జనాలను ఆకట్టుకోవడం ఈమెకు కొత్తేమీ కాదు.

ఇప్పుడంటే క్లాసిక్ సాంగ్ తో ఇండియన్స్ ను పలకరించింది కానీ.. సహజంగా ఈ భామ రణబీర్ కపూర్ తో కలిసి దిగిన ఫోటోల కారణంగానే మన వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. అతడితో కలిసి ఫారిన్ లో చక్కర్లు కొట్టడం.. ఇద్దరూ కలిసి సిగరెట్ తాగుతూ కెమేరాలకు చిక్కడం వంటివి జరిగాయి. ఈ క్లాసిక్ రీక్రియేషన్ లో తన ఫ్రెండ్ రణబీర్ ను కూడా భాగం చేసి ఉంటే ఇంకా బాగుండేది కానీ.. ఇక్కడ యంగ్ హీరోకు చుక్కలు కనిపించేవి.

వీడియో కోసం క్లిక్ చేయండి