Begin typing your search above and press return to search.
పాక్ పాప.. బాగానే ఆశలు పెట్టుకుందే
By: Tupaki Desk | 4 Feb 2017 9:41 AM GMTషారూక్ ఖాన్ లేటెస్ట్ మూవీ రయీస్.. ఇంటర్నేషనల్ గా ఇరగదీసి ఆడేస్తోంది. పూర్తి మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్ రాష్ట్రంలో లిక్కర్ డాన్ గా ఎదిగిన పాత్రలో షారూక్ అలరించేశాడు. ఈ మూవీకి మరో ఎట్రాక్షన్.. హీరోయిన్ గా పాకిస్తానీ బ్యూటీ మహిరా ఖాన్ నటించడమే. అయితే.. ఇండియాలో పాకిస్తానీ యాక్టర్లపై నిషేధం ఉండడంతో.. ప్రస్తుతం రయీస్ ప్రమోషన్స్ లో భాగం కాలేకపోయింది మహిరా.
కానీ.. ఇప్పుడు ఈ పాక్ పాపతో ప్రచారం మొదలుపెట్టించేసింది రయీస్ యూనిట్. కాకపోతే.. నేరుగా ఆమెను ఇండియాకి తీసుకురాకుండా.. ఓ లైవ్ వీడియా కాల్ ద్వారా మహిరా ఖాన్ తో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. 'ఒకసారి షారూక్ ఖాన్ తో వర్క్ చేశాక.. వేరే ఎవరితోనైనా వర్క్ చేయడం దాదాపు అసాధ్యం. సీరియస్ సీన్ చేసే ముందు కూడా నవ్విస్తూనే ఉంటాడు షారూక్' అంటూ షూటింగ్ సంగుతులు చెప్పిన మహిరా ఖాన్.. ఓ విషయంలో డిజప్పాయింట్ అయిందట.
'మొదటిసారి నేను ముంబై వచ్చినపుడు.. షారూక్ రెండు చేతులూ బార్లా చాపి నాకు ఎదురుగా పరిగెట్టుకుంటూ వచ్చి స్వాగతం పలుకుతారని అనుకున్నాను. కానీ అది జరగలేదు' అంటూ వగలు పోయింది పాకిస్తాన్ వయ్యారి. అయితే.. ఈ సినిమాలో షారూక్ పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మాత్రం భయపడిందట. కానీ రయీస్ రిలీజ్ అయ్యాక.. సాధించిన సక్సెస్ చూసి ఆ భయాలన్నీ తొలగిపోయాయని చెప్పింది మహిరా ఖాన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/