Begin typing your search above and press return to search.

కంట్రోల్ చేయడానికి బాహుబలి రావాలేమో

By:  Tupaki Desk   |   10 March 2017 12:18 PM GMT
కంట్రోల్ చేయడానికి బాహుబలి రావాలేమో
X
బాహుబలి ది కంక్లూజన్.. దేశం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. అంచనాలు ఎక్కువగా ఉన్నాయని అనడం.. ఈ సినిమా విషయంలో చాలా చిన్న మాట. ఇప్పుడీ బాహుబలి2 రిలీజ్ కు మరో 50 రోజుల సమయం కూడా లేదు.

అనుకున్న టైం కంటే షూటింగ్ పూర్తయేందుకు ఎక్కువ సమయం పట్టడం.. ట్రైలర్ ను సిద్ధం చేయడంలో ఆలస్యం కావడంతో.. ముందుగా ప్లాన్ చేసినట్లుగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టడానికి వీలు చిక్కలేదు. అయితే.. మార్చ్ 15న బాహుబలి 2 ట్రైలర్ లాంఛ్ తో తిరిగి పబ్లిసిటీకి శ్రీకారం చుట్టనున్నారు జక్కన్న అండ్ టీం. దీని తర్వాత గ్రాండ్ ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేశారు. డేట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. మొదట విశాఖలో జరుపుతారని భావించగా.. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ వెన్యూ హైద్రాబాద్ కు మారిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న మాహిష్మతి సెట్ లోనే ఆడియో వేడుక చేయనుంది బాహుబలి టీం.

బాహుబలి2 ఆడియో ఫంక్షన్ ను మాహిష్మతి రాజ్యంలో చేయడం అంటే సూపర్ అనాల్సిందే కానీ.. ఇక్కడికి తరలి వచ్చే వేలాదిమందిని కంట్రోల్ చేయడం ఎలా అన్నదే అసలు క్వశ్చన్. వందలు.. వేల మందితో షూటింగ్ చేయడం ఒక ఎత్తైతే.. అంత మంది పబ్లిక్ ని నియంత్రించడం మరో ఎత్తు. మరి ఈ ఆడియో వేడుకకు తరలివచ్చే జనాలను నియంత్రించేందుకు బాహుబలి నిజంగా దిగొస్తాడేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/