Begin typing your search above and press return to search.

బాహుబలి.. జై లవకుశ.. అది సంగతి

By:  Tupaki Desk   |   23 Sep 2017 10:30 PM GMT
బాహుబలి.. జై లవకుశ.. అది సంగతి
X
సాదారణంగా ఒక సినిమాకి మరొక సినిమాకి ఈ రోజుల్లో పోలికలు ఉండడం కామన్ అని చెప్పాలి. కొంచెం కథ మ్యాచ్ అయినా ప్రేక్షకుడు ఏ మాత్రం సహించడు. ఇక కంటెంట్ కొంచెం కనెక్ట్ అయినా సినిమావాళ్ల మధ్య వివాదాలు తార స్థాయిలో చెలరేగుతాయి. కొందరు దర్శకులు ఆ విషయంలో తెలివిగా ప్రవర్తించి హిట్ కొడితే మరి కొందరు ఒక్క పాయింట్ తో దొరికిపోతారు.

ఇప్పుడు అదే స్థాయిలో రెండు సినిమాల కథలు మ్యాచ్ అయ్యాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ సినిమాలు మరేవో కావు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మరియు కె.ఎస్ రవీంద్ర తీసిన జై లవకుశ చిత్రాలే. బాహుబలి ఎంత విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఇక జై లవకుశ కూడా తన స్థాయి మేరకు ప్రస్తుతం అందరినీ మెప్పిస్తోంది. సినిమాలు వేరైనా కంటెంట్ మాత్రం ఒకటని కొందరు అంటున్నారు. ఎందుకంటే రెండు సినిమాల్లో అన్నదమ్ముల మధ్య వైరం తార స్థాయిలో ఉంటుంది.ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. దర్శకులు కూడా ఈ కాన్సెప్ట్ లో చాలా బలం ఉంటుందని ఎంచుకుంటారేమో మొత్తానికి అన్నదమ్ముల శత్రుత్వాన్ని నిజ జీవితంలో జరిగిన దానికంటే భయంకరంగా చూపిస్తారు. బాహుబలి లో ఇద్దరు సోదరులు చంపుకోవడానికి సిద్ధపడతారు. ఎవరు చనిపోతారో తెలుసు. ఇక జై లవ కుశలో కూడా దాదాపు అదే కంటెంట్ తో నడుస్తోంది కానీ ముగింపు వేరు.

ఫైనల్ గా ఈ పాత్రలు చెప్పేది ఏమిటంటే తల్లి దండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకుంటే.. వారి మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయాని మనకు ఆ సినిమాలు చెబుతాయి. అది సంగతి.