Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: మిడిల్ క్లాస్ 'మజిలీ'
By: Tupaki Desk | 30 Dec 2018 5:50 AM GMTమొగుడు పెళ్లాల ఈగోల గురించి, మిడిల్ క్లాస్ ఈతి బాధల పైనా ఎన్నో సినిమాలొచ్చాయి. వాటన్నిటికంటే కొత్తగా ఈ కొత్త జంట `మజిలీ` ఎలా ఉండబోతోందో? అక్కినేని నాగచైతన్య - సమంత జంట పెళ్లి తర్వాత నటిస్తున్న సినిమాగా `మజిలీ`కి బోలెడంత ప్రచారం వచ్చింది. తాజాగా టైటిల్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసింది యూనిట్. ఈ లుక్ కామన్ ఆడియెన్‌కి బాగానే కనెక్టయిపోతోంది. విశాఖపట్నం వాల్తేరు గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టుకున్నారంటే ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టే కనిపిస్తోంది. ఆ ఎమోషనల్ మూవ్ మెంట్ థియేటర్ లో ఆడియెన్ కి కనెక్టయితే చాలు హిట్టు కొట్టినట్టే.
`నిన్ను కోరి` ఫేం శివ నిర్వాణ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎమోషనల్ గా ఫ్యామిలీ సెంటిమెంటుతో రూపొందిస్తున్నారని పోస్టర్ చెప్పకనే చెప్పింది. చైతూ సామాన్యుడిలా, మిడిల్ క్లాస్ బోయ్ గా యాప్ట్ అని పోస్టర్ చెబుతోంది. భార్య భర్తలు, ఈగోలు గొడవలు, ప్రేమలో పెయిన్ ఇవన్నీ తెరపై చూపిస్తున్నారు. వీళ్ల బాధలు కామన్ ఆడియెన్ బాధలు అయితే ఫలితం అందుకు తగ్గట్టే ఉంటుంది. పెయిన్ లేని జీవితం ఎవరికీ ఉండదు కాబట్టి ఆ మేరకు కాసులు కురిసే ఛాన్సుంటుంది. విశాఖ రైల్వే స్టేషన్ లో పని చేసే మిడిల్ క్లాస్ జంట లైఫ్ కథేంటో తెరపై చూడాలి.
2018 సంవత్సరం అక్కినేనీస్ కి తీపి చేదు గుర్తుల మేళవింపుగా మిగిలింది. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే సమంత నటించిన యూటర్న్ బావుందని ప్రచారం సాగినా, బాక్సాఫీస్ వద్ద కలిసి రాలేదు. మొత్తానికి ఈ ఫలితం ఊహించనిది. అందుకే కొత్త సంవత్సరంలో అయినా తమకు కలిసొస్తుందన్న ఆశాభావం ఉంది. జీవితం అంటేనే గెలుపోటముల కలబోత అని ప్రాక్టికల్ లైఫ్ ఎమోషన్ కూడా ప్రూవ్ చేస్తోంది. పెళ్లి తర్వాత స్పెషల్ మూవీ కాబట్టి చైతూ - సామ్ జోడీ ఎంతో ఎమోషనల్ గా కనెక్టయిపోయి నటిస్తున్నట్టే అర్థమవుతోంది. ఆ ఎమోషన్ పోస్టర్ లో కనిపిస్తోంది. మిడిల్ క్లాస్ కష్టం ఏంటో కానీ శివ నిర్వాణ వీళ్లకో హిట్టిస్తాడనే భావించాల్సి ఉంటుంది. సాహు గరికపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ కి రానుంది.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?